కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం(Wayanad Lok Sabha seat) నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా (MP Priyanka Gandhi Vadra) ఇవాళ లోక్‌సభలో ప్రమాణ స్వీకారం(Oath taking) చేశారు. ఆమెతోపాటూ మరికొందరు ఎంపీలు ప్రమాణం చేశారు. అయితే వారిలో ప్రియాంకా గాంధీ ప్రమాణం హైలెట్ అయ్యింది. ఆమె మాజీ ప్రధాని ఇందిరా గాంధీ(ఆగ Prime Minister Indira Gandhi)ని తలపించే లుక్‌లో కనిపించారు. ప్రియాంక తన చేతిలో చిన్న రాజ్యాంగం ప్రతిని(Constitution copy) పట్టుకొని.. రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ.. తనకు అప్పగించిన బాధ్యతల్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని అన్నారు. ఆ తర్వాత సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. దాంతో సభ అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.
భారీ మెజార్టీతో గెలిచి మరీ పార్లమెంటుకు..
రాహుల్ గాంధీ రాజీనామా(Rahul Gandhi’s resignation)తో వయనాడ్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో(By Election) ప్రియాంక 4,10,931 ఓట్ల మెజార్టీతో గెలిచి రాహుల్ రికార్డును బ్రేక్ చేశారు. కాగా, ప్రియాంకా గాంధీ జీవితం ఇప్పటివరకు వేరు.. ఇకపై వేరు. ఇప్పటివరకు ప్రపంచం ఆమెను ఇందిరా గాంధీకి మనవరాలిగా, రాజీవ్-సోనియా గాంధీల కుమార్తెగానే చూస్తూ వచ్చింది. కానీ ఇప్పుడామె కేరళలోని వయనాడ్ ఎంపీ. ఎంపీ హోదాలో తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అందుకే ఇకపై రాజకీయంగా ప్రియాంకా గాంధీ వేసే అడుగులు, ఎత్తుగడలు, పార్లమెంట్ సమావేశాల్లో ఆమె వాగ్ధాటి ఎలా ఉంటాయన్నదానిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉండనుంది.
నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ నుంచి ఏడుగురు
నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ(Nehru-Gandhi Family) నుంచి కాంగ్రెస్(Congress) తరఫున పోటీ చేసి ఏడుగురు పార్లమెంటుకు వెళ్లారు. ఇక 1951-52లో అలహాబాద్ నుంచి నెహ్రూ 1967లో రాయ్‌బరేలీ(RaeBareli) నుంచి ఇందిరా గాంధీ లోక్‌సభలో అడుగుపెట్టారు. 1980లో అమేథీ నుంచి సంజయ్ గాంధీ(Sanjay Gandhi) ప్రజల సమస్యలపై గళమెత్తగా.. 1981లో అమేథీ నుంచి రాజీవ్ గాంధీ పార్లమెంట్‌లో పాదం మోపారు. ఇక 1999లో అమేథీ నుంచి సోనియా గాంధీ(Sonia Gandhi) లోక్ సభలో ప్రమాణం చేయగా.. 2004లో అమేథీ నుంచి రాహుల్ గాంధీ, తాజగా 2024లో వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ తరఫున మొదటిసారి పోటీ చేసి పార్లమెంటు(Parliament)లో అడుగు పెట్టారు.






