మంచు ఫ్యామిలిలో గొడవతో (Manchu family controversy) మోహన్ బాబు, (Mohan Babu) మనోజ్ ఇంటి వద్ద పెద్ద హైడ్రామా కొనసాగుతుంది. తన తండ్రి అనుచరులు దాడి చేశారంటూ మనోజ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఒంటిమీద గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. మెడ, వెన్నుపూస, ఎడమ కాలి పిక్కకు గాయాలైనట్లు స్కానింగ్ లో తేలింది. మోహన్ బాబు అనుచరులతో మనోజ్ పై దాడి చేయించినట్లు తేలింది.
40 మంది బౌన్సర్ల మోహరింపు
మోహన్ బాబు అనుచరులు మంచు మనోజ్ (Manchu Manoj) పై దాడి నేపథ్యంలో పెద్ద కొడుకు మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదారాబాద్ వచ్చాడు. మరికాసేపట్లో జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటికి విష్ణు వెళ్లనున్నాడు. దీంతో ఈ నేపథ్యంలో జల్ పల్లి లోని మోహన్ బాబు నివాసం వద్ద బౌన్సర్లను మోహరించారు. దాదాపు 40 మంది బౌన్సర్లను మోహరించారు. ఇప్పటికే మోహన్ బాబు, విష్ణుతో మనోజ్ కు గతంలో గొడవ జరిగింది.
పెరిగిన ఉద్రిక్తత
మనోజ్ కూడా మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లను దింపారు. ఇప్పటికే విష్ణు (Manchu Vishnu) తరఫున 40 మంది బౌన్సర్లు సీన్ లోకి ఎంటర్ అయ్యారు. పోటీగా మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ 30 మంది బౌన్సర్లను తెప్పించాడు. మొత్తం 70 మంది బౌన్సర్ల తో మోహన్ బాబు (Mohan Babu) ఇంటి పరిసరాలు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. విష్ణు బౌన్సర్లను మోహన్ బాబు ఇంటిలోకి అనుమతించారు కానీ మనోజ్ తరఫు బౌన్సర్లను లోపలికి అనుమతించలేదు సెక్యూరిటీ సిబ్బంది. వారంతా మోహన్ బాబు ఇంటి గేట్ బయట వేచిచూస్తున్నారు. కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి విష్ణు చేరుకుని అసలు గొడవ ఎలా జరిగింది. ఎందుకు మోహన్ బాబును మనోజ్ కొట్టే వరకు వెళ్లింది. మనోజ్ పై దాడి చేసింది ఎవరనే విషయాలు తెలుసుకోనున్నారు. కాగా ఈ విషయం తమ పర్సనల్ అని పోలీసులు జోక్యం వద్దని తామే పరిష్కరించుకుంటామని మోహన్ బాబు చెప్పి వారిని పంపించారు. కాగా విష్ణు ఎంట్రీతో పోటాపోటీ బౌన్సర్ల మోహరింపుతో ఎప్పుడు ఎం జరుగుతుందోనని అంతా చర్చించుకుంటున్నారు.






