స్వాతంత్ర్య దినోత్సవం(Independance) సందర్భంగా విడుదలైన రజినీకాంత్ నటించిన ‘కూలీ(Coolie)’, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ ‘వార్ 2(War2)’ సినిమాలు బాక్సాఫీస్ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలు తొలి నాలుగు రోజుల్లో భారీ కలెక్షన్ల(Collections)తో దూసుకుపోతున్నాయి. అయితే ‘కూలీ’ కొంత అధిక్యతను చాటుకుంది. ‘కూలీ’ సినిమా, లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మాణంలో విడుదలై, మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 151 కోట్ల గ్రాస్ సాధించి కోలీవుడ్(Kollywood) రికార్డు సృష్టించింది.
కూలీకి కలిసొచ్చిన రజినీ స్టార్ డమ్
ఇక రెండో రోజు రూ. 54.75 కోట్లు, మూడో రోజు రూ. 38.5 కోట్లు, నాలుగో రోజు (August 17th) సుమారు రూ. 40 కోట్లతో ఇండియాలో నాలుగు రోజుల్లో రూ. 198.25 కోట్ల నెట్ వసూళ్లు(Net Collections) రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ. 110 కోట్లు దాటి, ప్రపంచవ్యాప్తంగా రూ. 310 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. తమిళనాడు, ఓవర్సీస్ మార్కెట్లలో రజినీకాంత్ స్టార్‌డమ్ ఈ విజయానికి కీలకం.
వార్-2కి కాస్త నిరాశే..
మరోవైపు ‘వార్ 2’ అయాన్ ముఖర్జీ(Ayan Mukerji) దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో విడుదలై మొదటి రోజు రూ.52 కోట్లు, రెండో రోజు రూ.57.35 కోట్లు, మూడో రోజు రూ.33 కోట్లు, నాలుగో రోజు సుమారు రూ.35 కోట్లతో ఇండియాలో రూ. 177.35 కోట్ల నెట్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 260 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. హిందీ మార్కెట్‌లో హృతిక్ రోషన్(Hrithik Roshan), తెలుగులో NTR ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ కలెక్షన్లకు బలం చేకూర్చాయి. రెండు సినిమాలకూ మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వరుస సెలవు(Holidays) నేపథ్యంలో బుకింగ్స్ జోరుగా సాగాయి. ఇక సోమవారం నుంచి కలెక్షన్లు అదే రేంజ్‌లో ఉంటే ఈ చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడం ఖాయమని సినీవర్గాలు పేర్కొంటున్నాయి.






