దేశంలో మరోసారి కరోనా(Corona Virus) మహమ్మారి చాపకింద నీరు లాగా విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల(Positive Cases) సంఖ్య క్రమంగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలో యాక్టివ్ కొవిడ్ కేసుల(Active Covid Cases) సంఖ్య 4500 దాటడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో ఏడుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ(Central Health Department) వర్గాలు వెల్లడించాయి. కేరళ(Keral)లో అత్యధికంగా కరోనా కేసులు ఉండగా.. ఆ తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీల్లో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ…
ఇక బుధవారం ఉదయం 10 గంటల నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు 564 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,866కి చేరింది. అలాగే మరో 674 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ దీని ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం APలో 50, తెలంగాణలో 3 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇక అత్యధికంగా కేరళలో 1413 కేసులుండగా.. ఢిల్లీ 681, మహారాష్ట్ర 521, కర్ణాటక 293, తమిళనాడు 291, గుజరాత్ 271, వెస్ట్ బెంగాల్‌లో 127 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ప్రజలు మాస్కులు(Masks) ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది.






