నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగానే కాదు నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు. ఆయన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాస్ పై ఇటీవల రూపొందించిన సినిమా కోర్ట్ : స్టేట్ వర్సెస్ నోబడీ (Court : State Vs Nobody). ప్రియదర్శి, శివాజీ, హర్ష రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు రామ్ జగదీష్ తన తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టాడు.
The audience have ruled their judgement in favour of #CourtTelugu 💥💥💥#Court continues to do well at the ticket windows and collects a gross of 33.55+ CRORES WORLDWIDE in 5 days ❤🔥
Book your tickets for #Court now!
▶️ https://t.co/p7sCPIObj8#CourtStateVsANobody ⚖️… pic.twitter.com/vZbwU13Ef1— KADAPA SREENU (@SREENU_24) March 19, 2025
కోర్ట్ వసూళ్లు
కోర్ట్ (Court Collections) డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆసక్తికరమైన కథనం, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాను నాని ప్రజెంట్ చేయడం, ప్రమోషన్స్ సమయంలో ఈ మూవీపై హైప్ క్రియేట్ చేయడం కూడా ఈ చిత్రానికి కలిసొచ్చింది. అందుకే బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.33.55 కోట్ల వసూళ్లు రాబట్టింది.
బాక్సాఫీస్ వద్ద కోర్ట్ కలెక్షన్స్
అమెరికాలో కూడా ఈ సినిమా సాలిడ్ కలెక్షన్లు (Court Collections in US) రాబడుతోంది. ఇప్పటికే 800K డాలర్ల మార్క్‌ను దాటిన ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకుంటోంది. సాధారణంగా లీగల్ డ్రామాలంటే బోర్ అనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతిని అందిస్తోంది. ఆరో రోజుకూడా బుకింగ్స్ స్ట్రాంగ్‌గా ఉండడంతో, ఈ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది.






