భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) సీనియర్ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి (Suravaram Sudhakar Reddy, 83) శుక్రవారం (ఆగస్టు 22) రాత్రి హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar District) కొండ్రావుపల్లిలో 1942 మార్చి 25న జన్మించిన సుధాకర్‌రెడ్డి, విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలం(Left-wing ideology)తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కర్నూలు ఉస్మానియా కళాశాల నుంచి బీఏ, హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి LLB పట్టా పొందారు.
కార్మిక, రైతు, విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర
సుధాకర్‌రెడ్డి 1966లో AISF జనరల్ సెక్రటరీగా, 1970లో అధ్యక్షుడిగా పనిచేశారు. 1971లో సీపీఐ జాతీయ కౌన్సిల్(CPI National Council)లో చేరి, 1998, 2004లో నల్గొండ నుంచి లోక్‌సభ(Loksabha)కు ఎన్నికయ్యారు. 2012-2019 మధ్య సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీని బలోపేతం చేశారు. కార్మిక, రైతు, విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన, 2000లో విద్యుత్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ జైలు శిక్ష అనుభవించారు. తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఆయన, సామాజిక న్యాయం, కార్మిక హక్కుల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు.
CPI leader & ex-MP Comrade Suravaram Sudhakar Reddy’s demise is deeply distressing.
His mark on Telangana politics & Communist movement is unforgettable. As Nalgonda MP & CPI Gen Sec, his contributions shine.
My condolences to his family. May his soul rest in peace.… pic.twitter.com/AmAtGfPkBs
— Danasari Seethakka (@seethakkaMLA) August 22, 2025
రాజకీయ ప్రముఖుల సంతాపం
సుధాకర్‌రెడ్డి మరణంతో వామపక్ష రాజకీయాల్లో పెను లోటు ఏర్పడింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, BRS అధ్యక్షుడు కేసీఆర్, KTR, హరీష్ రావు, సీపీఐ నేత కే. నారాయణ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు నిఖిల్, కపిల్‌లకు పలువురు రాజకీయ ప్రముఖులు సానుభూతి తెలిపారు. ఆయన అంత్యక్రియలు అధికారక లాంఛనాలతో జరగనున్నాయి.






