ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) పేరు మార్మోగిపోతోంది. ఏ సినిమా చేసిన బంపర్ హిట్ అవుతోంది. వరుస మూవీలతో జోరుమీదున్న రష్మిక.. మరో భారీ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. యానిమల్, పుష్ప-2తో బ్లాక్‌బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. తాజాగా హిందీలో ‘ఛావా(Chhaava)’ మూవీలోనూ నటించగా.. రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో రష్మిక నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తో జతకట్టేందుకు రష్మిక సిద్ధమైనట్లు టీటౌన్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఫ్యాన్స్ భారీ ఎక్స్‌పెక్టేషన్స్
వివరాల్లోకి వెళితే, డైరెక్టర్ బుచ్చిబాబు(Bucchibabu) దర్శకత్వంలో రామ్‌చరణ్ ప్రస్తుతం ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్(Director Sukumar) దర్శకత్వంలోనూ చెర్రీ ఓ మూవీకి సైన్ చేశాడు. ‘రంగస్థలం’ తర్వాత రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ ఎక్స్‌పెక్టేషన్సే పెట్టకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్‌పై దృష్టి పెట్టిన లెక్కల మాస్టార్, గ్లోబల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా యాక్షన్ ఎంటర్‌టైనర్(Action entertainer)గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని సమాచారం. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మికను తీసుకోవాలని చూస్తున్నట్లు మేకర్స్ భావిస్తున్నారట.

సినీ వర్గాల్లో జోరుగా చర్చ
ఇప్పటివరకు రామ్‌చరణ్, రష్మిక కాంబో(Ram Charan-Rashmika combo)లో ఒక్కమూవీ కూడా రాలేదు. కాబట్టి, ఈ కొత్త జోడీ తెరపై ఆకట్టుకుంటుందని సుకుమార్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ సినిమా పట్టాలెక్కడానికి సమయం ఉండటంతో హీరోయిన్ ఎంపికలో మార్పులు వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ, రష్మిక మందన్న ఈ ప్రాజెక్ట్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ క్లారిటీ రానుంది.






