క్రికెట్, బాలీవుడ్ ది అవినాభావ సంబంధం. చాలా మంది క్రికెటర్లు బాలీవుడ్ నటులను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని జంటలు విడాకులు తీసుకుని వేరొకరితో తమ జీవితాన్ని పంచుకున్నారు. మరికొందరు మాత్రం జాలీగా వారి మ్యారిడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా టీమిండియాలో ఓ స్టార్ ప్లేయర్ తన భార్యతో విడాకులకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ జంట ఏదంటే..
విడాకుల బాటలో మరో జంట
టీమిండియా స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) గురించి తెలియని వారుండరు. ఈ స్పిన్నర్ ఆటోతనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు మరింత చేరువయ్యాడు. ఈ ప్లేయర్ తన భార్య, ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma)తో విడాకులు తీసుకోబోతున్నారంటూ కొంతకాలం నుంచి వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఇప్పుడు విడాకుల వార్తకు మరింత బలం చేకూరినట్టయింది.
ఇన్ స్టాలో అన్ ఫాలో
చాహల్ తన భార్యను అన్ ఫాలో చేయడమే కాదు.. ఆమెతో ఉన్న ఫొటోలను కూడా తన అకౌంటులో నుంచి తొలగించాడు. ఈ నేపథ్యంలో ఈ జంట విడిపోతుందంటూ ఇప్పుడు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే విడాకులు రావడానికి మరికొంత సమయం పట్టొచ్చని కొందరు అంటున్నారు. అయితే కారణాలు తెలియదు కానీ.. ఈ జంట విడిపోతుందంటూ చాలా కాలం నుంచే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
న్యూ లైఫ్ లోడెడ్
చాహల్ డెంటిస్ట్, కొరియోగ్రాఫర్ ధనశ్రీని 2020 డిసెంబరు 22వ తేదీన వివాహం చేసుకున్నాడు. ధనశ్రీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇద్దరూ కలిసి చాలా రీల్స్ చేశారు. అవి నెటిజన్లను ఎంతో ఫిదా చేశాయి. ఇక ఇటీవల ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ తొలగించడంతో కొందరు ఈ జంట విడాకులు తీసుకోనుందని వార్తలు పుట్టించారు. ఇక ఆ తర్వాత చాహల్ ‘న్యూ లైఫ్ లోడెడ్’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్ పెట్టడంతో వీరి విడాకులు ఖాయం అనే ప్రచారం జరిగింది. ఇక తాజాగా సోషల్ మీడియా ఖాతాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఇది కన్ఫామ్ అయినట్టేనని నెటిజన్లు అంటున్నారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.







