Mana Enadu : సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో (Sandhya Theatre Stampede Case) ఓ మహిళ మరణించడంతో వారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఓయూ జేఏసీ నేతలు ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun Case) ఇంటి వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఇంటి గోడ దూకి టమాటలు విసరడం, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. బన్నీ ఈరోజు చిక్కడపల్లిలోని పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన సందర్భంగా ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయనను పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
పరదాలతో అల్లు అర్జున్ ఇల్లు క్లోజ్
ప్రస్తుతం అల్లు అర్జున్ విచారణ ముగియడంతో ఆయన తన ఇంటికి చేరుకున్నారు. అయితే ఆయన ఇంటికి చేరుకున్న సమయంలో ఆయన ఇంటి చుట్టూ తెల్లటి పరదాలు (Curtains At Allu Arjun Residence) ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. ఇటీవల బన్నీ ఇంటిపై ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులు దాడి చేసిన నేపథ్యంలో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ పరదాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు మీడియా కూడా ఆయన ఇంటి వైపునకు చూడకుండా గేటు నుంచి బాల్కనీ వరకు ఈ పరదాలు కట్టారు.
Allu Arjun’s Jubilee Hills residence gets a privacy makeover with a Paradha covering amid heightened public attention. Recent incidents, including stone-pelting, celebrity visits, and media glare, seem to have prompted this move.
Meanwhile, the star continues his investigation… pic.twitter.com/REGmRF3icJ
— TopTeluguNews (@TheSPRWorld) December 24, 2024
ఆ సీన్ రిపీట్ కాకుండా
ఇటీవల ఓయూ జేఏసీ నాయకులు జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ (Allu Arjun House Attacked) ఇంటి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. రేవతి కుటుంబానికి వెంటనే రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తు నినాదాలు చేశారు. కొందరు ఆందోళన కారులు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరి.. ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంటి ఆవరణలోని వివిధ రకాల పూల కుండీలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్టు చేశారు. మరుసటి రోజు కోర్టు వారిని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.






