బంగాళాఖాతం(Bay of Benal)లో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడటంతో తమిళనాడు(Tamilnadu), పుదుచ్చేరి(
Puducherry), ఆంధ్రప్రదేశ్(AP)లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ఇది రానున్న 12 గంటల్లో తీవ్ర తుఫాను(Cyclone)గా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీనికి ‘ఫెంగాల్ తుఫాన్(Cyclone Fengal)’గా నామకరణం చేశారు. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో 35 నుంచి 55KM వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. గురువారం, శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఫెంగాల్ తుఫాను(Cyclone Fengal) నేపథ్యంలో తమిళనాడులోని వివిధ జిల్లాల్లో స్కూళ్లు(Schools), కాలేజీ(Colleges)లకు సెలవులు ప్రకటించారు. మరోవైపు ఏపీలో గురువారం (Nov 28) నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. బాపట్ల, ప్రకాశం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, YSR కడప జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం (Nov 29) నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల, బాపట్ల, శ్రీ సత్యసాయి, YSR కడప, శ్రీకాకుళం, విజయనగరంలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది.
రైతులు జాగ్రత్తగా ఉండాలి
ఇక శనివారం (Nov 30) నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, YSR కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, బాపట్ల, ప్రకాశం, శ్రీ సత్యసాయి, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు వాయుగుండం ప్రభావం తెలంగాణలోని పలు జిల్లాలపై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) తెలిపింది. రైతులు పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
🌪️ **Cyclone Fengal Update:** Moving towards #TamilNadu coast, expected landfall between Chennai & Puducherry on Nov 29. Heavy rainfall & strong winds anticipated. Stay safe, follow local authorities' guidance. #CycloneFengal #TamilNaduWeather pic.twitter.com/xldsz4anWD
— MDApp (@MDAppMDApp) November 27, 2024