Mana Enadu: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగుల(Government Employees)కు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం విషయంలో శుభవార్త చెప్పింది. దీపావళి(Diwali) కానుకగా ఉద్యోగుల డీఏ (Dearness Allowance)ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు వారికి 3.64% డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది. నవంబరు జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లించనుంది. 2022 జులై ఒకటి నుంచి 2024 OCT 31 వరకు డీఏ బకాయిలు జీపీఎఫ్(General Provident Fund) ఖాతాలో జమ చేస్తామని అధికారులు చెప్పారు.
ఏడు సమాన వాయిదాల్లో చెల్లింపు.. ఉద్యోగుల సంబురాలు
ఈమేరకు 2025 మార్చి 31వ తేదీ లోపు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు DA బకాయిలు 17 సమాన వాయిదాల్లో చెల్లస్తామని సీఎం రేవంత్ సర్కార్ తెలిపింది. CPS ఉద్యోగులకు DA బకాయిలు 10% ప్రాన్ ఖాతాకు జమ చేయనున్నారు. 2025 ఫిబ్రవరి నుంచి 90% డీఏ17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నారు. GPF ఖాతాలు లేని ఫుల్ టైం కాంటింజెంట్ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేపడతారు. విశ్రాంత ఉద్యోగుల(For retired employees)కు డీఏ బకాయిలు 2025 జనవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువరించింది. దీంతో దీవాళికి ముందే ప్రభుత్వం శుభవార్త చెప్పడంతో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.






