‘డాకు మహారాజ్‌’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నందమూరి బాలకృష్ణ (Balakrishna) ‘డాకు మహారాజ్’ సినిమాతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. జనవరి 12వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. చిత్రబృందం ప్రస్తుతం సక్సెస్ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉంది. ఇక నెటిజన్లు కూడా డాకు మేనియాలో ఉన్నారు. సోషల్ మీడియాలో డాకు జోరు గట్టిగా సాగుతోంది.

తొలిరోజు వసూళ్లు ఎంతంటే..?

బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్‌ (Daaku Maharaaj)’ తొలిరోజు రూ.56 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.  బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో ‘డాకు మహారాజ్‌’ చేరింది. అలా ఈసారి సంక్రాంతి పండుగ పూట కూడ బాలయ్య సూపర్ హిట్ కొట్టాడు.

సక్సెస్ జోష్ లో బాలయ్య..

డాకు మహారాజ్ సినిమా విజయం సాధించడంతో చిత్రబృందం సూపర్ జోష్ లో ఉంది. బాలకృష్ణ సినిమా అంటే మాస్‌ ఎలివేషన్స్‌తో పాటు డైలాగులకు ప్రాధాన్యం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ‘డాకు మహారాజ్‌’లోనూ బాలయ్య మార్క్‌ డైలాగులు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ‘సింహం న‌క్క‌ల‌ మీద‌ కొస్తే వార్ అవ్వ‌దు’.. ‘వార్నింగ్ చంపేవాడు ఇవ్వాలి, చ‌చ్చేవాడు కాదు’.. వంటి డైలాగులు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.

సంక్రాంతి విన్నర్ బాలయ్య

మరోవైపు ఓవర్సీస్‌లో టికెట్స్ ఓపెన్‌ చేసిన నాటినుంచి బుకింగ్స్‌లో హవా చాటిన ‘డాకు మహారాజ్‌’ తొలిరోజు వన్‌ మిలియన్‌ క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ప్రత్యేక పోస్టర్‌ను షేర్ చేసింది. అలా ఈ సంక్రాంతి రేసులో డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య విన్నర్ అయ్యాడంటూ ఫ్యాన్స్‌ ఖుష్ అవుతున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *