Mana Enadu : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్ (Daaku Maharaaj)’. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ఫీమేల్ లీడ్ లో కనిపించనుంది. ఈ చిత్రం జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయనుంది. ఇప్పటికీ ఇంకా ఈ సినిమా ప్రమోషన్స్ షురూ కాలేదు. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ పీక్స్ లో ప్లాన్ చేసినట్లు నిర్మాత నాగవంశీ వెల్లడించారు.
ఆంధ్రాలో డాకు మహారాజ్ రచ్చ
జనవరి 2వ తేదీన ట్రైలర్ రిలీజ్ (Daaku Maharaaj Trailer) చేసినట్లు నాగవంశీ తెలిపారు. 4వ తేదీన అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్, 8వ తేదీన ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నట్లు వెల్లడించారు. 8న ఆంధ్రాలోని విజయవాడ-మంగళగిరి ప్రాంతంలో అభిమానుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించనున్నట్లు చెప్పారు. సినిమాకు ఎలాంటి పెయిడ్ ప్రీమియర్లు లేవని స్పష్టం చేశారు. తెల్లవారుజాము నాలుగు గంటలకు తొలి షో ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
Ni daring ni Dexxa film producer anukunava. Leka #Balayya fans president anukunava @vamsi84 🥵#DaakuMaharaaj
— S U N N Y ᴹᵃʰᵃʳᵃᵃʲ (@NSTC9999) December 23, 2024
బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్
“తమన్ సినిమా ఫస్ట్ హాఫ్ మాకు చూపించారు. ఇది చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం మాకుంది. 30 ఏళ్లలో బాలకృష్ణను ఇలాంటి విజువల్స్ లో చూసుండరు. బాలయ్య ఫ్యాన్ గా ఆయణ్ను నేను ఎలా చూడాలనుకున్నానో బాబీ అలాగే చూపిస్తున్నారు. జైలర్ చిత్రం చూసిన తర్వాత ఓ హీరోను ఇలా కూడా చూపించొచ్చా అనిపించింది. డాకు మహారాజ్ లో బాలయ్యను అలాగే చూపించబోతున్నాం.” అంటూ సినిమాపై నాగవంశీ (Naga Vamsi) మరింత హైప్ క్రియేట్ చేశారు.






