నందమూరి బాలకృష్ణ (Balakrishna) డైరెక్టర్ బాబీ కాంబోలో వస్తున్న సినిమా డాకు మహారాజ్ (Daaku Maharaaj). ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి దబిడి దిబిడి అనే పాట రిలీజ్ అయింది. ఈ పాటలో బాలయ్య బాబు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలాతో కలిసి స్టెప్పులేశాడు.
పూనకాలు తెప్పిస్తున్న దబిడి దిబిడి
ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన పాట ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోంది. కాసర్ల శ్యామ్ ఈ పాటను రాయగా.. తమన్, వాగ్దేవి పాడారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాడు. ఇక ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
జనవరి 4న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్
ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ లో వేగం పెంచింది. జనవరి 4వ తేదీన అమెరికా డల్లాస్లోని Texas Trust CU Theatreలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన హై ఎనర్జిటిక్ FIERCE Track నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు ఆ తర్వాత ఆంధ్రాలోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.






