
డైనమిక్ హీరో అడివి శేష్(Adivi Sesh) నటిస్తున్న పాన్-ఇండియన్ థ్రిల్లర్ ‘డెకాయిట్(Dacoit). మృణాల్ ఠాకూర్(Mrinal Thakur) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన ఫైర్ గ్లింప్స్(Glimpse) ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్‌తో అదిరిపోయింది. డైరెక్టర్ షానియల్ డియో(Shaneil Deo) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజువల్‌గా ఫైర్ గ్లింప్స్ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు(Post-production works) శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా అడివి శేష్ డెకాయిట్ కోసం డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేశారు. దీనికి సంబధించిన ఫొటోని SMలో షేర్ చేశారు.
మాజీ లవర్స్ తప్పని పరిస్థితుల్లో కలిసి దోపిడీ..
ఇదిలా ఉండగా ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్(Dacoit Shooting Schedule)పై కూడా మరో అప్డేట్ వచ్చేసింది. రేపటి నుంచి (జూన్ 8) కీలక సన్నివేశాలపై షూట్ ప్రారభించనున్నారు. ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సీన్స్(Action Scenes)ను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ(Supriya Yarlagadda) నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు మాజీ లవర్స్ తప్పని పరిస్థితుల్లో కలిసి దోపిడీలు చేయడమే డెకాయిట్ ప్రధాన బ్యాక్‍డ్రాప్‍గా తెరకెక్కుతోంది. కాగా ఈ మూవీని ఈ క్రిస్మస్(Chrismas) కానుకగా డిసెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.