సినిమా హీరోల రెమ్యునరేషన్ గురించి విక్టరీ వెంకటేశ్ (Venkatesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. జనవరి 14వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.230 కోట్ల వసూళ్లు రాబట్టింది. అనిల్ రావిపూడి వెంకీ కాంబో ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టింది. ఈ సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది.
హీరోల వల్లే చిక్కులట
ఈ సందర్భంగా ఇటీవల నిర్మాత దిల్ రాజు(Dil Raju)పై జరుగుతున్న ఐటీ దాడుల గురించి స్పందించాలని ఈ చిత్రబృందాన్ని మీడియా కోరింది. ఈ నేపథ్యంలో హీరోలు తమ రెమ్యునరేషన్ బ్లాక్ లో కాకుండా వైట్ లో తీసుకుంటే ఇలాంటి చిక్కులు రావని పలువురు నిర్మాతలు చెబుతున్నారని.. దీనిపై మీ స్పందన ఏంటంటూ వెంకటేశ్ ను రిపోర్టర్లు ప్రశ్నించారు.
నేను అలా తీసుకోను
దానికి ఆయన స్పందిస్తూ.. అందరు హీరోల సంగతి తనకు తెలియదని, తాను మాత్రం రెమ్యునరేషన్ చాలా తక్కువగా తీసుకుంటానని, అది కూడా వైట్ లోనే తీసుకుంటానని చెప్పారు. కోట్ల రూపాయల పారితోషికం తీసుకోవాలన్న కోరిక తనకు లేదని స్పష్టం చేశారు. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో డబ్ చేసి రిలీజ్ చేయొచ్చుకదా అని మరో రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘మేము వచ్చింది తీసుకుంటాం. అంతే కానీ ఎక్కువగా ఆశించమంటూ’ చెప్పుకొచ్చారు వెంకీ.
The #BlockbusterSankranthikiVasthunam trio lit up the BOX OFFICE SAMBHAVAM Press Meet ❤️🔥
Team #SankranthikiVasthunam shared exciting insights and celebrated the success with an electrifying interaction with the media 💥💥
The energy is unmatched, just like the movie’s… pic.twitter.com/2agQHv9AeJ
— Sri Venkateswara Creations (@SVC_official) January 23, 2025






