‘రాబిన్‌హుడ్’ మూవీలో డేవిడ్ వార్నర్.. ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌ (Nithin) న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్‌ (Robinhood). వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ యేర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు.  జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ లో వేగం పెంచింది.

రాబిన్ హుడ్ మూవీలో ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించి ఫొటోలు నెట్టింట గతంలో లీక్ అయ్యాయి. ఇక తాజాగా ఈ మూవీలో వార్నర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ లుక్‌లో వార్న‌ర్ అదిరిపోయాడు. దీనిపై నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. గ్రౌండ్ లో  అద్భుతాలు సృష్టించిన వార్న‌ర్ (Warner in Telugu Film) ఇక సిల్వర్ స్క్రీన్ పై సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు వస్తున్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. వెండితెర పై సంచ‌నాల‌ను సృష్టించాల‌ని కోరుకుంటున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *