డేవిడ్ వార్నర్(David Warner).. ఈ పేరు తెలియని వారు దాదాపు ఉండరు. బ్యాటింగ్‌లో బౌలర్లకు చుక్కలు చూపించే ఈ ఆస్ట్రేలియా ఆటగాడు(Australian player). IPL ద్వారా ఇండియన్స్‌కు చాలా దగ్గరయ్యాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టుకు కెప్టెన్‌గా, ప్లేయర్‌గా తెలుగు ప్రేక్షకుల(Telugu audience)కు మరింత దగ్గరయ్యాడు. అంతేకాదు ఆ మధ్య వచ్చిన ‘పుష్ప’ సినిమాలో స్టెప్పులు వేసి అల్లు అర్జున్(Allu Arjun)ని కూడా ఇమిటేట్ చేసి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడీ లెఫ్ట్ హ్యాండ్ క్రికెటర్. అంతేకాదు ఓ అంతర్జాతీయ ఆటగాడు, స్టేడియంలో మ్యాచ్ ఆడుతూ, ఓ తెలుగు హీరోని ఇమిటేట్ చేయడం అప్పట్లో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయిన విషయం తెలిసిందే.
3 రోజులు షూటింగ్‌లో పాల్గొన్న వార్నర్
తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చినప్పుడల్లా ఆ పాటలకు డాన్సులు వేస్తూ వార్నర్ రీల్స్(Reels) చేసేశాడు. ఓ దశలో ‘పుష్ప-2(Pushpa-2)’లో వార్నర్ నటిస్తాడన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే, తాజాగా వార్నర్‌కు సంబంధించి న్యూస్ బయటికొచ్చింది. ఓ టాలీవుడ్ సినిమాలో డేవిడ్ నటిస్తున్నాడు. ఇంతకీ ఏ హీరో సినిమాలో నటిస్తున్నాడనే కదా మీ డౌట్. నితిన్(Nitin) హీరోగా వస్తోన్న కొత్త సినిమా ‘రాబిన్‌హుడ్(Robinhood)’లో వార్నర్ ఛాన్స్ కొట్టేశాడు. ఈ సినిమాలో గెస్ట్ రోల్(Guest Role)లో మెరిసేందుకు వార్నర్ ఓకే చెప్పాడట. ఇప్పటికే లండన్‌లో మూడు రోజుల పాటు ఈ సినిమా షూటింగ్లో వార్నర్ పాల్గొన్నాడు.
నితిన్‌కు జోడీగా శ్రీలీల
అయితే వార్నర్ కనిపించేది కాసేపే అయినా, ఈ సినిమాలో కథ మలుపు తిరగడానికి ఈ పాత్ర కారణం అవుతుందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. అందుకే ఈ పాత్రకు సంబంధించిన విషయాల్ని మేకర్స్ గోప్యంగా ఉంచుతున్నారు. తాజాగా హైదరాబాద్(HYD)లో ‘రాబిన్‌హుడ్’ ప్రెస్ మీట్ జరిగింది. ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం ప్రెస్ ముందుకు రావడం ఇదే తొలిసారి. దర్శకుడు వెంకీ కుడుముల(Directer Venky Kudumula) మాట్లాడుతూ..‘వార్నర్ పాత్ర గురించి ఇప్పుడే ఏం చెప్పదలచుకోలేదు’ అంటూ జవాబు ఇచ్చాడు. కాగా ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల(Srileela) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ డిసెంబరు 25న థియేటర్లలోకి రాబోతోంది.






