మైదానంలో తనదైన స్టైల్లో బౌలర్లపై విరుచుకుడిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) మరో కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. నితిన్, శ్రీలీల(Nitin-Sreeleela) జంటగా నటిస్తున్న ‘రాబిన్ హుడ్(Robinhood)’ మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో అతడు ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే తెలిపారు. తన రోల్ కోసం అతడు నాలుగు రోజుల పాటు షూటింగులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. తాజా వార్నర్‌కు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే..

వార్నర్ రెమ్యునరేషన్‌పై జోరుగా చర్చ
ఈ మూవీలో నటించేందుకు వార్నర్ అందుకున్న రెమ్యునరేషన్(Remuneration)పై ఇప్పుడు తెగ చర్చ నడుస్తోంది. సాధారణంగా క్రికెట్లో అయితే అతడికి భారీ మొత్తంలో అందుకుంటుండేవాడు. మరి తాజా సినిమాకు అతడెంత మొత్తం ఛార్జ్ చేశారని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. రాబిన్ హుడ్ సినిమాలో నటించినందుకు డేవిడ్ వార్నర్ రూ.3 కోట్లు అందుకున్నాడట. ఇక సినిమా ప్రమోషన్ల(Promotions)లో పాల్గొనేందుకు అదనంగా రూ.కోటి ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఓ వార్త సోషల్ మీడియా(SM)లో వైరల్‌గా మారింది. దీంతో ఆయన అభిమానులు “డేవిడ్ భాయ్ చాలా కాస్ట్లీ” అంటూ కామెంట్లు పెడుతున్నారు.

తెలుగు హీరోలను అనుకరిస్తూ..
కాగా IPLలో SRH తరపున డేవిడ్ వార్నర్ ఆడాడు. ఈ క్రమంలోనే తెలుగు హీరోలను అనుకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు. పుష్ప సినిమాలోని అల్లు అర్జున్(Allu Arjun) స్టైల్ అండ్ స్వాగ్‌ను రీక్రియేట్ చేసిన వార్నర్ వీడియో వైరల్ గా మారింది. ఈ విధంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వార్నర్ ను రాబిన్ హుడ్ మూవీ మేకర్స్ తమ సినిమాలో నటించేందుకు ఒప్పించారు. కాగా, డైరెక్టర్ వెంకీ కుడుముల(Director Venky Kudumula) తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 28న థియేటర్లలోకి రానుంది.






