
ప్రపంచ దేశాలను ప్రకృతి ప్రకోపాలు(Natural Disasters) గడగడ వణికిస్తున్నాయి. మొన్నటి వరకూ అమెరికాలో కార్చిచ్చు(Burned in America).. న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్‌లో వరుస భూకంపాల(Earthquakes)తో ప్రజలు బెంబేలెత్తిపోయారు. తాజాగా పశ్చిమాఫ్రికా దేశమైన నైజీరియా(Nigeria)లో భారీ వర్షాల(Heavy Rains)కు తలెత్తిన వరదలు(Floods) తీవ్ర విషాదం నింపాయి. గత కొన్ని రోజులుగా అక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. దీంతోపాటు ఓ భారీ డ్యామ్(Dam) కుప్పకూలడంతో ఒక్కసారిగా వరద ఉద్ధృతి ఊహించని విధంగా పెరిగి, పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు 111 మంది మృతి చెందినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
కొనసాగుతున్న సహాయక చర్యలు
నైజీరియాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. భారీ వరదల ప్రవాహానికి ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. అనేకమంది నివాసాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం రాత్రి వరకు 111 మృతదేహాలను సహాయక బృందాలు(Rescue Teams) వెలికితీశాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వాతావరణ మార్పుల(Climate changes) కారణంగానే నైజీరియా తరచుగా తీవ్ర వరదలను ఎదుర్కొంటోందని, స్వల్ప వ్యవధిలోనే అధిక వర్షపాతం(High rainfall) నమోదై భారీ నష్టాన్ని కలిగిస్తోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
At least 110 people killed as floods caused by torrential rain impact central Nigeria, officials say. – BBC pic.twitter.com/Tr6il6v86J
— PatriotN (@An14711567) May 30, 2025