
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం(Pashamaiaram)లోని సిగాచీ పరిశ్రమ(Sigachi industry)లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం(Fire Accident)లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య నేటికి (జులై 4) 39కి చేరింది. పటాన్‌చెరులోని ధ్రువ ఆస్పత్రి(Dhruva Hospital)లో చికిత్స పొందుతున్న భీమ్ రావు(Bhim Rao) అనే కార్మికుడు ఈరోజు ఉదయం మృతి చెందడంతో మృతుల సంఖ్య పెరిగింది. మృతుడు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు.
7 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక
కాగా ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఇప్పటికే ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ(High level committee) దర్యాప్తును ముమ్మరం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీ ఈరోజు ప్రమాద స్థలాన్ని సందర్శించనుంది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించి, 7 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక(Preliminary report)ను సమర్పించనుంది.
#Hyderabad—#SigachiPharma Blast: Death toll rises to 39
One more injured worker succumbed, taking the death count in Sigachi Industries’ #Pashamylaram explosion to 39.#DNA tests continue to identify remains. #Govt panel probing causes; preliminary #report expected in a… pic.twitter.com/HBiPu5Lgrg
— NewsMeter (@NewsMeter_In) July 4, 2025
ఇప్పటివరకు 31 మృతదేహాలను గుర్తింపు
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 31 మృతదేహాలను గుర్తించామని, మరో 9 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రవీణ్య(Collector P. Praveenya) తెలిపారు. సహాయక బృందాలు శిథిలాల నుంచి 20 అస్థిపంజర భాగాలను వెలికితీసి, DNA గుర్తింపు కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు వెల్లడించారు. ఇప్పటికే 95% DNA నమూనాల సేకరణ పూర్తయిందని SP పరితోశ్ పంకజ్ చెప్పారు. ఇదిలా ఉండగా, గాయపడిన 33 మందిలో 12 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, వారికి తక్షణ సాయంగా రూ. 1 లక్ష చొప్పున అందించామని సిగాచీ పరిశ్రమ యాజమాన్యం ప్రకటించింది. క్షతగాత్రులకు పూర్తి వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది.