అర్జున్ రెడ్డితో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ‘యానిమల్(Animal)’ మూవీతో బాలీవుడ్‌ని షేక్ చేశాడు. తదుపరి చిత్రంగా ఇప్పుడు ప్రభాస్(Prabhas)తో కలిసి పాన్ ఇండియా మూవీ స్పిరిట్ (Spirit) తెరకెక్కిస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.
రూ.20 కోట్ల రెమ్యునరేషన్!
అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మూవీ మేకర్స్ నేషనల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ దీపికా పదుకొణెను (Deepika Padukone) సంప్రదించగా.. ఆమె రూ.20 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్. కాగా ఆ డిమాండ్ను నిర్మాతలు అంగీకరించినట్లు సమాచారం. ఇది నిజమైతే దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గా దీపికా నిలవనుంది. ప్రభాస్–దీపిక ఇదివరకే నాగ్ అశ్విన్(Nag Ashwin) డైరెక్షన్లో కల్కి(Kalki) మూవీలో కలిసి నటించిన విషయం తెలిసిందే.
ప్రేక్షకుల్లో ఆసక్తి
తన కెరీర్లో తొలిసారి ప్రభాస్ స్పిరిట్ మూవీలో పోలీస్ పాత్రలో కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా, ఎప్పుడు పూర్తవుతుందా అని డార్లింగ్ ఫ్యాన్స్(Fans) ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మూవీ 2026 నవంబర్ లేదా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
#Spirit will release in Mid 2026 🔥🔥🔥🔥🔥#Prabhas | #SandeepReddyVanga pic.twitter.com/7sDH7pOJAu
— BFilmy Official (@_BFilmyOfficial) November 12, 2024






