
బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనే(Deepika Padukone) హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్(Hollywood Walk of Fame)లో స్టార్ పొందిన తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(Hollywood Chamber of Commerce) ఈ విషయాన్ని లైవ్‌స్ట్రీమ్ ద్వారా ప్రకటించింది. దీపికా ఈ గౌరవాన్ని మోషన్ పిక్చర్స్(Motion pictures) విభాగంలో ఎమిలీ బ్లంట్, టిమోతీ చలమెట్, రామి మాలెక్ వంటి అంతర్జాతీయ తారలతో పంచుకుంది. కాగా ఈ అవార్డును వచ్చే ఏడాది దీపిక అందుకోనుంది. ఈ సందర్భంగా భారత అభిమానులు(Fans) సోషల్ మీడియా(SM)లో ఆనందం వ్యక్తం చేశారు.దీపికా 2006లో కన్నడ చిత్రం ‘ఐశ్వర్య’తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
ఉత్తమ నటి డెబ్యూ ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో గుర్తింపు
2007లో ‘ఓం శాంతి ఓం’ చిత్రంతో బాలీవుడ్(Bollywood)లో అరంగేట్రం చేసి, ఉత్తమ నటి డెబ్యూ ఫిల్మ్‌ఫేర్ అవార్డు(Filmfare Award for Best Actress Debut) గెలుచుకుంది. ‘కాక్‌టైల్’, ‘పికు’, ‘పద్మావత్’, ‘బాజీరావ్ మస్తానీ’ వంటి చిత్రాలతో ఆమె ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. 2017లో ‘XXX: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ‘పఠాన్’, ‘జవాన్’, ‘కల్కి 2898 AD’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఆమె భారత సినిమా పరిశ్రమలో అగ్రస్థానంలో నిలిచింది.
[News] Deepika Padukone will be the first Indian to be honoured with a star on the Hollywood Walk of Fame for the class of 2026 in the Motion Pictures category⭐ pic.twitter.com/m1aVgwFZO7
— Deepika Padukone FC (@DeepikaPFC) July 2, 2025
లైవ్, లవ్, లాఫ్ ఫౌండేషన్‌తో మానసిక ఆరోగ్యంపై అవగాహన
దీపికా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించే ‘లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్(Live Love Laugh Foundation)’ స్థాపకురాలు. 2018లో టైమ్ మ్యాగజైన్ 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో, 2022లో టైమ్100 ఇంపాక్ట్ అవార్డు(Time100 Impact Award) అందుకుంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, మెట్ గాలాలో ఆమె ప్రదర్శన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ గౌరవం భారత సినిమా పరిశ్రమకు, భారతీయ నటుల ప్రపంచ గుర్తింపుకు నిదర్శనమని సినీప్రముఖులు కొనియాడుతున్నారు.