
అందంతో పాటు అద్భుతమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే(Deepika Padukone). ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్న ఈ అందాల భామ.. తల్లి అయిన తర్వాత కూడా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రెమ్యునరేషన్(Remuneration) విషయంలో ఇతర హీరోయిన్ల కంటే ఎక్కువ డిమాండ్ చేస్తోంది. పెళ్లి అయ్యాక కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించిన ఆమె, త్వరలోనే మళ్లీ కెమెరా ముందుకు రానుందనే వార్తలు జోరందుకున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Director Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘స్పిరిట్(Spirit)’లో దీపిక నటించనుందనే ప్రచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఏకంగా రూ.20 కోట్ల పారితోషికం
కాగా ‘స్పిరిట్(Spirit)’ సినిమా షూటింగ్(Shooting) త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించేందుకు దీపికా అంగీకరించినట్లు, ఇందుకు ఆమె ఏకంగా రూ.20 కోట్ల పారితోషికం(Remuneration) అందుకోనున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై అఫీషియల్ ప్రకటన వెలువడనప్పటికీ, ఇదే నిజమైతే ఇండియన్ సినీ చరిత్రలోనే ఒక నటికి ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడం ఇదే తొలిసారి అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
#TrendingNews: Deepika bags ₹20 cr for Spirit, Preity’s real tears in Kal Ho Naa Ho, Aryan teases BTS from The Bads of Bollywood, Anurag slams Vivek, Uorfi misses Cannes due to visa, Urvashi stuns in butterfly gown. And Many More
.
.
.#DeepikaPadukone #PreityZinta #AryanKhan… pic.twitter.com/2JAKoIMGjb— India Forums (@indiaforums) May 14, 2025