IPL 2025లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్(DC), లక్నో సూపర్ జెయింట్స్(LSG) తలపడుతున్నాయి. వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్(Axer Patel) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో తన పాత ఫ్రాంచైజీపై KL రాహుల్ చెలరేగుతాడా? లేదా? అనే ఆసక్తి నెలకొంది. అటు గత సీజన్ వరకూ DCతో ఉన్న రిషభ్ పంత్(Rishabh Pant) ఇప్పుడు లక్నో తరఫున బరిలోకి దిగుతున్నాడు. దీంతో అందరి కళ్లూ ఈ ఇద్దరిపైనే ఉన్నాయి.
కాగా ఢిల్లీ క్యాపిటల్స్ కొన్ని సీజన్లుగా తన రెండో హోమ్ గ్రౌండ్‌గా విశాఖపట్టణం(Vizag)ను ఎంచుకున్న విషయం తెలిసిందే. రెండు టీమ్స్ లోనూ మంచి హిట్టర్లు ఉండటంతో విశాఖలో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
తుది జట్లు ఇవే..
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, రిషబ్ పంత్(W/C), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్
LSG Impact Players: మణిమారన్ సిద్ధార్థ్, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, ఆకాష్ సింగ్, ఆర్ఎస్ హంగర్గేకర్.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(w), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్.
DC Impact Players: కరుణ్ నాయర్, అశుతోష్ శర్మ, డోనోవన్ ఫెరీరా, త్రిపురాన విజయ్, దర్శన్ నల్కండే






