ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్(LSG) తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(DC) 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. లక్నోలోని ఏకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో క్యాపిటల్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్(Axer Patel) తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన LSG నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన DC కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలోనే 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
రాహుల్ ప్రతీకార ఇన్నింగ్స్..
ఓపెనర్ కరుణ్ నాయర్ (15) త్వరగానే ఔటైనా, మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్సర్), వికెట్ కీపర్ బ్యాటర్ KL రాహుల్ (42 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో మెరిశారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. పోరెల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్ (20 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. రాహుల్ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. లక్నో బౌలర్లలో ఐడెన్ మార్క్రమ్(Markram) 2 వికెట్లు పడగొట్టాడు.
🚨 Indian Premier League 2025, DC vs LSG 🚨
Winning Moments!#DCvLSG #LSGvsDC #DCvsLSG #LSGvDC #IPL2025 #TATAIPL2025 #TATAIPL #Lucknow #DelhiCapitals #LucknowSuperGiants pic.twitter.com/akjkwF7Yz4
— Sporcaster (@Sporcaster) April 22, 2025
బ్యాటింగ్‌లో ఆ ముగ్గురే..
అంతకుముందు లక్నో బ్యాటర్లలో మార్క్రమ్ 52, మార్ష్ 45, బదోని 36 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో LSG నిర్ణీత 20 ఓవర్లలో 159/6 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్(Mukesh Kumar) 4 వికెట్లతో సత్తాచాటాడు. స్టార్క్, చమీరా చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో డీసీ పాయింట్ల పట్టికలో 2వ స్థానాన్ని పటిష్ఠం చేసుకోగా.. లక్నో జట్టు 5వ ప్లేస్‌కు పడిపోయింది. కాగా ఇవాళ హైదరాబాద్ వేదికగా SRH vs MI జట్లు తలపడనున్నాయి.
Match day, SRH🧡 MI💙#SRHVSMI #OrangeArmy pic.twitter.com/JcXVsdptoH
— ꜱᴀͥɪᴋͣɪͫʀᴀɴʀᴇᴅᴅʏ (@SaikiranRDY_) April 22, 2025






