Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా ప్రగతి పథంపై డిప్యూటీ సీఎం భట్టి స్పెషల్ ఫోకస్

రాష్ట్రంలో ఖమ్మం జిల్లా(Khammam district)ను అగ్రగామిగా నిలిచేలా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే జిల్లాకు పలు అభివృద్ధి ప్రాజెక్టులను తీసుకొచ్చిన భట్టి ఇక వాటిని త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఆయన హయాంలో ఖమ్మం పట్టణం టు బోనకల్(Khammam town to Bonakal) ప్రాంత అభివృద్ధికి గత కొన్నాళ్లుగా అనేక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. తాజా ప్రాజెక్టులు, రవాణా సదుపాయాలు, విద్యా రంగం(Education sector), వ్యవసాయ సౌకర్యాలు, ఇంద్రమ్మ డైరీ ఇలా అంతా కలిపి ఈ ప్రాంతానికి భవిష్యత్‌లో విస్తృతమైన అభివృద్ధి మార్గాన్ని చూపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదని జిల్లావాసులు ఆశిస్తున్నారు.

May be an image of 6 people, dais, temple and text

రైల్వే సరుకు రవాణా కేంద్రంగా పందిళ్లపల్లి

అలాగే రైతు మార్కెట్(Rythu Market), యువతకు ఉపాధి, విద్యార్థికి నాణ్యమైన విద్య, ప్రజలకు రవాణా సౌకర్యం అందించడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం భట్టి కృషి చేస్తున్నారు. ఇక ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే(Khammam-Devarapalli Greenfield Highway)లో భాగంగా, దంసలాపురం వద్ద ప్రతిపాదించిన ఎగ్జిట్ ఖమ్మం పట్టణానికి, బోనకల్ రోడ్డుకు నేరుగా లాభాన్ని అందిస్తుంది. దీని ద్వారా సరకు రవాణా, వాహన రాకపోకలు వేగవంతమవుతాయి. వాణిజ్య రంగం, రియల్ ఎస్టేట్, చిన్న వ్యాపారాలకు ఇది ఒక పెద్ద ఊపునివ్వనుంది. మరోవైపు పందిళ్లపల్లి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రైల్వే గోదాం(Railway Godown) స్థానికులకు నేరుగా ఉపాధిని అందిస్తుంది. రైల్వే సరుకు రవాణా కేంద్రంగా ఇది మారింది. వ్యవసాయ ఉత్పత్తులు, రైతులకు అవసరమైన ఎరువులు, పరిశ్రమల సరుకులు వేగంగా మార్కెట్‌కు చేరే అవకాశం పెరిగింది. దీని ద్వారా స్థానిక రైతులకు, వ్యాపారులకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గుతుంది.

Pandillapalli Railway Station, Bonakal Road, Chinthakani, Khammam District,  Telangana, 507208

బోనకల్ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు

బోనకల్‌లో ఇందిరమ్మ డైరీ(Indiramma’s Diary) స్థాపనతో పాల ఉత్పత్తి రంగం అభివృద్ధి చెందుతుంది. ఇది పాలు ఉత్పత్తి చేసే రైతులకు స్థిరమైన మార్కెట్ కల్పిస్తుంది. అలాగే, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ హైస్కూల్(Integrated International High School) నిర్మాణం స్థానిక విద్యార్థులకు నాణ్యమైన విద్యా సదుపాయాలు అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందడం ఒక గొప్ప అవకాశం. మత్కేపల్లి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్మాణం పూర్తి అనుమతులు రావడం ద్వారా రైతులకు పంటలు అమ్మడానికి సులభమైన వేదిక ఏర్పడుతుంది. నేరుగా మార్కెట్ యాక్సెస్ రావడంతో రైతులు మంచి ధర పొందే అవకాశం ఉంటుంది. మధ్యవర్తులపై ఆధారపడకుండా అమ్మకం జరగడం రైతు ఆదాయాన్ని పెంచుతుంది.

List of Best Schools in Khammam, Telangana 2025-2026

త్వరలో ప్రధాన వాణిజ్య, విద్యా కేంద్రంగా ఖమ్మం జిల్లా

ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉన్న ఖమ్మం-బోనకల్ నాలుగో లైన్ రోడ్ విస్తరణ పనులు పూర్తయితే రవాణా సౌకర్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ట్రాఫిక్(Traffic) ఒత్తిడి తగ్గి, పరిశ్రమలు(industries), వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడుతుంది. మొత్తం మీద, గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఎగ్జిట్, రైల్వే గోదాం, కొత్త పరిశ్రమలు, ఆధునిక విద్యాసంస్థలు, మార్కెట్ సదుపాయాలు ఇలా అన్నీ కలిపి ఖమ్మం-బోనకల్ ప్రాంతాన్ని రాబోయే సంవత్సరాల్లో తెలంగాణలోనే ఖమ్మం జిల్లా ఒక ప్రధాన వాణిజ్య, పరిశ్రమ, విద్యా కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కృషి, పట్టుదల, ప్రజా సమస్యల(Public issues) పట్ల అంకితభావం ప్రధాన కారణమని స్థానికులు భావిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ సహకారం కలిసి వస్తే ఈ ప్రాంతం మరింత మరింత వేగంగా దూసుకుపోతుందని జిల్లా వాసులు అంటున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *