గత రెండు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని కొన్ని ఆలయాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా మే ప్రారంభంలో జరిగిన గోడ కూలి ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. భక్తుల క్యూ లైన్ల వద్ద ఈ ప్రమాదం జరగడం ఆందోళన కలిగించింది. తిరుపతిలోనూ భక్తులకు అసౌకర్యాలు ఎదురయ్యాయి. గత జనవరిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు గాయపడటం, మరణించిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయ విచారణ కూడా ప్రారంభమైంది. మే మొదటి వారంలో తిరుమల క్యూ లైన్లలో భక్తుల మధ్య తోపులాటలు జరిగాయి.
ఆలయాలపై దాడి.. వైసీపీ సీరియస్..
అయితే, పలు ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం గురించిన ఆందోళనలు గతంలో ఉన్నప్పటికీ, గత రెండు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విగ్రహాల ధ్వంసం జరిగినట్లు ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తున్నది. ఆలయాల వద్ద భద్రత, భక్తుల సౌకర్యాలు మెరుగుపరచాల్సిన కూటమి సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని ప్రతి పార్టీలు ఆరోపిస్తున్నాయి. గత రెండు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ఆలయాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి.
సింహాచలం చందనోత్సవంలో అపశృతి..
సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా మే ప్రారంభంలో జరిగిన గోడ కూలి ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. భక్తుల క్యూ లైన్ల వద్ద ఈ ప్రమాదం జరగడం ఆందోళన కలిగించింది.తిరుపతిలోనూ భక్తులకు అసౌకర్యాలు ఎదురయ్యాయి. గత జనవరిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు గాయపడటం, మరణించిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయ విచారణ కూడా ప్రారంభమైంది. మే మొదటి వారంలో తిరుమల క్యూ లైన్లలో భక్తుల మధ్య తోపులాటలు జరిగాయి.
కూటమి సర్కార్ పై వైసీపీ ఫైర్
పలు ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం గురించిన ఆందోళనలు గతంలో ఉన్నప్పటికీ, గత రెండు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విగ్రహాల ధ్వంసం జరిగినట్లు ప్రతిపక్ష వైసీపీ(YCP) ఆరోపిస్తోంది. ఆలయాల వద్ద భద్రత, భక్తుల సౌకర్యాలు మెరుగుపరచాల్సిన కూటమి సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. గత ఏప్రిల్ నెలలో శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలో రెండురోజుల వ్యవధిలో 15 నక్షత్ర తాబేళ్లు మరణించడం, ఆ తర్వాత విశాఖపట్నం జిల్లా సింహాచలంలో చందనోత్సవ టైంలో గోడ కూలి ఏడుగురు భక్తుల మరణం వంటి హృదయ విదారక ఘటనలు అధికార పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి.
కోదండరామాలయంలో విగ్రహాల ధ్వంసం..
ఈ ఘటనలు మరువక ముందే శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం పెద్ద పల్లిపేటలోని కోదండ రామాలయం(kodanda ramalayam)లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. ఆలయంలోని బాల శశిశేఖర ఆలయంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఏడు విగ్రహాల(7 Goddess statues demolished)ను ధ్వంసం చేశారు.వాటికి దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. గుడి చుట్టూ ఉన్న దశావ తార విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.
భగ్గుమంటున్న హిందూ సంఘాలు
వీటిలో వామనావతరం విగ్రహాం పూర్తి ధ్వంసం కాగా, కలిక, బలరామ, శ్రీరాముడు, పరశురామ, నరసింహ, శ్రీకృష్ణుడు విగ్రహాల చేతులు విరిగిపోయి ఉన్నాయి. కొన్ని విగ్రహాలకు కత్తి, నాగలి, పిల్లనగ్రోవి వంటివి విరిగిపోయాయి.కాగా, ఆలయ అర్చకులు మహేంద్రాడ లక్ష్మణమూర్తి, కోదండరామాచార్యులు, చామర్తి రామగోపాలచార్యులు ఆలయ ఈఓకు, స్థానిక పెద్దలకు తెలియజేయగా.. వాళ్లు పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు భగ్గమంటున్నాయి.






