Mana Enadu : దీపావళి పండుగ (Diwali 2024) వచ్చేసింది. ప్రతి ఇంట్లో వెలుగుల కాంతులు తెచ్చేసింది. చీకటిని తరిమి జీవితంలో వెలుగులు నింపే ఈ పండుగను కుటుంబ సభ్యులంతా కలిసి జరుపుకుంటారు. కొత్త దుస్తులు, పిండి వంటలు, పూజలు, బాణసంచా (Fire Crackers) ఇలా అంతా కలిసి జాలీగా ఎంజాయ్ చేస్తారు. ఇక సాయంత్రం వేళ లక్ష్మీపూజ సమయంలో భక్తి శ్రద్ధలతో అమ్మను పూజిస్తున్నారు. మరి ఈ దీపావళికి లక్ష్మీదేవి మీరు ఇలా పూజించారంటే ఏడాది పాటు అష్టైశ్వర్యాలు మీ ఇంట్లో కళకళలాడుతుంటాయి. మరి ఆ వివరాలేంటో చూద్దామా?
ఎప్పుడు పూజ చేస్తే మంచిది
అక్టోబర్ 31వ తేదీన (గురువారం) సాయంత్రం లక్ష్మీ దేవి పూజ (Lakshmi Devi Puja) చేయాలని పండితులు చెబుతున్నారు. గురువారం సాయంత్రం 5.34 గంటల నుంచి రాత్రి 8.06 గంటల మధ్యలో ధనలక్ష్మీ పూజ చేసుకోవచ్చని తెలిపారు. ఏడాదంతా లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే వృషభ లగ్నంలో ధనలక్ష్మీ పూజ చేసుకోవడం ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు. గురువారం సాయంత్రం 6.40 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల మధ్యలో వృషభ లగ్నం ఉందని .. ఆ సమయంలో పూజ చేసుకోవచ్చని చెబుతున్నారు.
పూజా విధానం ఇదే:
ముందుగా ఇళ్లు శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లులు వేసుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరాన్ని అలకరించుకుని.. కుడిచేత్తో బంగారు నాణేలు వర్షిస్తున్న లేదా ఏనుగులు నీటితో లక్ష్మీదేవి(Lakshmi Devi 2024)ని అభిషేకిస్తున్న చిత్రపటానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించాలి. ఆ తర్వాత దీపారాధన చేసి అమ్మవారికి ఆవు పాలు లేదా బెల్లంతో చేసిన నైవేద్యం సమర్పించాలి. అనంతరం
అమ్మవారి ఫొటోపై అక్షింతలు చల్లుతూ లక్ష్మీ అష్టోత్తర నామాలు పఠించి అమ్మకు హారతినివ్వాలి. చివరగా కొబ్బరికాయ కొట్టి.. పూజ పూర్తయ్యాకు అందరికి ప్రసాదం పంచిపెట్టాలి.