తమిళ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో నటన, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్(Fan Base)ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) కూతురు ఐశ్వర్య(Aishwarya)ని పెళ్లాడాడు. వీరికి యాత్ర రాజా, లింగా అనే ఇద్దరు కొడుకులున్నారు. అయితే అనూహ్యంగా మనస్పర్ధలతో ఈ జంట దాదాపు 20 ఏళ్ల తర్వాత విడిపోయింది. ప్రస్తుతం వీరు విడివిడిగానే ఉంటున్నారు. అయితే విడుకుల(Divorce) తర్వాత ధనుష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఆ మధ్య తరచూ వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ధనుష్ మళ్లీ ఐశ్వర్యతో కలిసి కనబడడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకీ వీరిద్దరూ మళ్లీ ఎందుకు కలిశారో తెలుసుకుందామా..
SHOCKING 😳 Dhanush and his wife part ways after 18 years of togetherness. The actor took to his social media handle to make an official announcement @dhanushkraja #Aishwarya #Dhanush pic.twitter.com/nCr9N2dRdb
— BombayTimes (@bombaytimes) January 17, 2022
మనవడికి రజినీకాంత్ శుభాకాంక్షలు
హీరో ధనుష్ -ఐశ్వర్య కుమారుడు యాత్ర రాజా(Yathra Raja) తాజాగా స్కూల్ గ్రాడ్యుయేషన్(School Graduation) పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఐశ్వర్య అలాగే హీరో ధనుష్ ఇద్దరు కలిసి పాల్గొన్నారు.ఈ తరుణంలో తమ కొడుకును ఇద్దరు హగ్ చేసుకుని మరి ఫోటో దిగారు. ఈ ఫోటో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఫోటోను సూపర్ రజినీకాంత్ షేర్ చేశారు. తన మనవడికి రజినీకాంత్ శుభాకాంక్షలు(Congrats) చెప్పారు. నా ముద్దుల మనవడా మొదటి మైలురాయి దాటేశావ్… యాత్ర కన్నా శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నాడు. కాగా ధనుష్, ఐశ్వర్య ఇద్దరు కో పేరెంటింగ్(Co-Parenting) చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే కొడుకు కోసం ఇద్దరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని సమాచారం. ఏది ఏమైనా కొడుకు కోసం ఇద్దరూ ఇలా కనిపించడం చూడముచ్చటగా ఉందని అభిమానులు అంటున్నారు.






