
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela)కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సినీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో ఉన్న ఈ బ్యూటీకి సంబంధించి కొన్ని స్పెషల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందుకు తగ్గట్లు ఈ భామ ఈరోజు.. బిగ్ డే అంటూ క్యాప్షన్ ఇవ్వడంతోపాటు త్వరలోనే పూర్తి వివరాలు చెబుతానంటూ ‘కమింగ్ సూన్’ అని హింట్ ఇచ్చింది. ఇంతకీ ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల పెట్టిన స్టోరీ ఫొటోల్లో శ్రీలీల చెంపలకు కొందరు పసుపు రాసి బొట్టు పెట్టినట్లు ఉంది. మరో ఫొటోలో ఆమె పెళ్లి కూతురిలా ముస్తాబైంది. దీంతో శ్రీలీల సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుందని, త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అఫీషియల్‌గా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.. కానీ
అయితే శ్రీలీల దీనిపై అఫీషియల్‌గా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కానీ త్వరలో చెబుతానని, తనకు ఈరోజు ‘బిగ్ డే’ అంటూ.. హింట్ ఇచ్చింది. అయితే, నెటిజన్ల నుంచి శ్రీలీల షేర్ చేసిన ఫొటోలపై భిన్నంగా స్పందిస్తున్నారు. శ్రీలీల నిశ్చతార్థం చేసుకుందని కొందరు అంటుంటే, మరికొందరు ఏదో యాడ్ కోసమై ఉంటుందని, శ్రీలీల కొత్తగా ఇల్లు కట్టుకుందని దాని గృహప్రవేశం కావొచ్చని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం ఏదైనా వాణిజ్య ప్రకటన కోసం ఆమె చేస్తున్న ప్రమోషన్స్ కావచ్చని అంటున్నారు. కాగా బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan), శ్రీలీల (Sreeleela) డేటింగ్‌లో ఉన్నారంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.
Good News from #Sreeleela ? 🥳🥳🥳♥️
Stay Tuned for Official Announcement 📢 📢 pic.twitter.com/5XVCp9GO5x
— Filmy Bowl (@FilmyBowl) May 31, 2025