టాలీవుడ్ (Tollywood) లో ఇటీవల వివాదాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పుడిప్పుడే అంతా సర్దుకుంటున్న సమయంలో ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju Comments) సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈ పండుగ పూట రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిజామాబాద్ లో సోమవారం రోజున ట్రైలర్ లాంఛ్ (Sankranthiki Vasthunam Trailer)) ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిల్ రాజు సంచలన కామెంట్స్
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సినిమాను ఏ స్థాయిలో ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలంగాణలో.. అది కూడా తెలుగు సినిమాకు కేంద్ర బిందువైన హైదరాబాద్ లో టాలీవుడ్ చిత్రాలకు ఎంత ఆదరణ ఉంటుందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే దిల్ రాజు తాజా ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు మాత్రం దీనికి విరుద్ధంగా ఉన్నాయి. భాష, డైరెక్టర్, నటీనటులకు సంబంధం లేకుండా సినిమాను ఆదరించే తెలంగాణ జనంపై ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
#ANDHRA People Gives a GREAT VIBE For FILMS but #TELANGANA People give Importance to MUTTON and Wine – #DilRaju 😳😳😳💥💥💥#SankranthikiVasthunam pic.twitter.com/PIfuJV3zN3
— GetsCinema (@GetsCinema) January 6, 2025
మావోళ్లకు కల్లు మటన్ చాలు
తెలంగాణ ప్రజలను ఉద్దేశించి దిల్ రాజు.. “ఆంధ్రాకు వెళ్తే సినిమా అంటే ఓ వైబ్ ఇస్తారు అక్కడి జనం. సినిమా ఈవెంట్ అంటే తండోపతండాలుగా తరలి వస్తారు. ఇక తమ అభిమాన హీరో చిత్రమైతే నీరాజనాలు పడుతారు. కానీ తెలంగాణలో సినిమాలు తక్కువ కాబట్టి ఇక్కడ అంత వైబ్ ఉండదు. మావోళ్లకు సినిమా కంటే.. తెల్ల కల్లు, మటన్ అంటేనే ఇష్టం. మావోళ్లు వాటికే వైబ్ ఇస్తారని నేను మా డైరెక్టర్ కు చెప్పాను. అందుకే తెలంగాణలో సినిమాకు రియాక్షన్ తక్కువ వస్తుందని చెప్పా.” అంటూ దిల్ రాజు కామెంట్స్ చేశారు.
దిల్ రాజు కామెంట్స్ వైరల్
ప్రస్తుతం దిల్ రాజు కామెంట్స్ హాట్ టాపిక్ (Dil Raju Comments Viral) గా మారాయి. తెలంగాణలో సినిమాలు చేస్తూ.. హైదరాబాద్ లో ఉంటూ.. తెలంగాణ వాసి అయి.. ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. తెలంగాణలో సినిమాకు ఎంత ఆదరణ లభిస్తుందో ఒక నిర్మాతగా ఆయనకు తెలియదా అంటూ ధ్వజమెత్తుతున్నారు. మొత్తానికి ఇప్పుడు దిల్ రాజు కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
The team of #SankranthikiVasthunam from the trailer launch event❤️🔥
Thank you Nizamabad for all the MASSive love and making the event a grand success ❤️
— https://t.co/ArMj9xkrde#సంక్రాంతికివస్తున్నాం GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025. pic.twitter.com/DDrvOJPZTI
— Sankranthiki Vasthunam (@SVMovieOfficial) January 6, 2025
హ్యాట్రిక్ కొట్టేనా?
ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంగతికి వస్తే.. ఇందులో వెంకటేశ్ (Venkatesh) హీరోగా నటిస్తుండగా.. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో హిట్ కొట్టిన వెంకీ, అనిల్ (Anil Ravipudi) కాంబో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది.






