అనిల్ రావిపూడి సినిమాలో.. అసలు పేరుతో చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడుగా చూపిస్తున్నారు. తాజాగా ఆయన వశిష్ఠతో కలిసి విశ్వంభరలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. ఇక ఈ చిత్రం తర్వాత చిరు.. అనిల్ రావిపూడితో కలిసి ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉగాది రోజున ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తి చేసుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) చిరుతో సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

‘చిరు’నవ్వుల పండగబొమ్మకి శ్రీకారం

చిరంజీవితో సినిమాపై అనిల్ రావిపూడి ఓ కీలక అప్డేట్ ఇచ్చారు. ‘‘స్క్రిప్టు వినిపించడం అయిపోయింది. బాస్ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. చిరంజీవికి నా కథలో పాత్ర ‘శంకర్‌ వరప్రసాద్‌ (Shankar Vara Prasad)’ని పరిచయం చేశాను. ఆయనకు ఆ రోల్‌ బాగా నచ్చింది. ఇంకెందుకు ఆలస్యం.. మంచి ముహూర్తంతో.. ‘చిరు’నవ్వుల పండగబొమ్మకి శ్రీకారం’’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టి, అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది చూసి ఈ సినిమాలో చిరు పాత్ర పేరు శంకర్ వరప్రసాద్ అయి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.

Image

అనిల్ సినిమాలో శంకర్ వరప్రసాద్

ఇక చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్‌ అన్న విషయం తెలిసిందే. అనిల్‌ సినిమాలో ఆయన పాత్ర పేరు కూడా శంకర్‌ వరప్రసాద్‌ అని డైరెక్టర్ ఇచ్చిన అప్డేట్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇక చిరంజీవి శంకర్ అనే పేరుతో ఇప్పటికే పలు సినిమాలు చేశారు. ‘లంకేశ్వరుడు’ సినిమాలో శివ శంకర్‌గా, ‘ఇంద్ర (Indra)’లో శంకర్‌ నారాయణ, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’, ‘శంకర్‌దాదా జిందాబాద్‌’లో శంకర్‌ప్రసాద్‌గా నటించి అలరించారు. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్లే. అయితే అనిల్ తో చేయనున్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *