ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్(Basil Joseph) కాంబో ‘శక్తిమాన్(Shaktimaan)’ అనే భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుందంటూ గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియా(SM)లోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ఊహాగానాలకు డైరెక్టర్ జోసెఫ్ తాజాగా తెరదించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రచారంపై బాసిల్ జోసెఫ్ స్పందిస్తూ, “ఆ కథనాల్లో నిజం లేదు. ‘శక్తిమాన్’ ప్రాజెక్ట్ పూర్తిగా బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్(Ranveer Singh)తోనే ఉంటుంది” అని తేల్చిచెప్పారు. దీంతో బన్నీ-జోసెఫ్ కాంబోలో మూవీ లేదని స్పష్టమైంది.
‘శక్తిమాన్’పై చాలా కాలంగా ప్రయత్నాలు
కాగా గత కొద్ది కాలంగా, అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని మలయాళంలో ‘Minnal Murali’ వంటి విజయవంతమైన సినిమాను అందించిన దర్శకుడు, నటుడు బాసిల్ జోసెఫ్‌తో చేయనున్నారని, అది కూడా 90వ దశకంలో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సూపర్ హీరో ధారావాహిక ‘శక్తిమాన్’ ఆధారంగా ఉండబోతోందని వార్తలు విస్తృతంగా వ్యాపించాయి. నిజానికి, ‘శక్తిమాన్’ పాత్రతో ఓ భారీ సినిమాను రూపొందించాలని బాలీవుడ్(Bollywood)లో చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Shaktimaan Reboot: Basil Joseph Addresses Rumors of Allu Arjun Replacing Ranveer Singh in the Iconic Role.https://t.co/sGiaTmx4Jy
Recent rumors have been swirling about Allu Arjun potentially replacing Ranveer Singh in the highly anticipated film adaptation of the iconic Indian…— DailyDigest360 (@daily_digest360) June 22, 2025
గతంలో ఈ పాత్ర కోసం రణ్వీర్ సింగ్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చినా, ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు దర్శకుడి ప్రకటనతో, ఆ సినిమా రణ్వీర్ సింగ్‌తోనే ఉండబోతోందని మరోసారి క్లారిటీ వచ్చేసింది. కాగా బన్నీ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ఓ భారీ ప్రాజెక్టు చేస్తున్న విషయం తెలిసిందే.






