గోపిచంద్ మ‌లినేని తొలి బాలీవుడ్ మూవీ ‘జాట్’ టీజ‌ర్ రిలీజ్

Mana Enadu : గోపీచంద్ మలినేని (Gopichandh Malineni ).. డాన్ శీను, క్రాక్, వీరసింహా రెడ్డి వంటి పవర్ ఫుల్ హిట్ సినిమాలను టాలీవుడ్ కు అందించిన యంగ్ డైరెక్టర్. ఈ దర్శకుడు బాలీవుడ్ లో తన తొలి సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. గ‌తేడాది గ‌ద‌ర్-2 (Gadar-2) సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న‌ బాలీవుడ్ న‌టుడు స‌న్నీ డియోల్ తో గోపీచంద్ ‘జాట్ (Jaat Movie)’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.

గోపీచంద్ బాలీవుడ్ ఎంట్రీ

ఈ టీజర్ లో సన్నీ డియోల్ (Sunny Deol) ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా గోపిచంద్ హీరోలంటేనే మాస్ ఇమేజ్ తప్పకుండా ఉంటుంది. అలాంటింది ఊరమాస్ స్టార్, యాక్షన్ హీరో సన్నీ డియోల్ తో కలిసి ఈ డైరెక్టర్ సినిమా అంటే యాక్షన్ ఇంకా ఏ రేంజులో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో మరో బీ టౌన్ నటుడు రణదీప్ హుడా (Randeep Hooda) విలన్ గా నటిస్తున్నాడు. 

బాలీవుడ్ హీరోతో గోపీచంద్ సినిమా

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  టాలీవుడ్ మ్యూజిక్‌ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. రిషి పంజాబి సినిటోగ్రాఫర్‌ గా.. అవినాష్‌ కొల్ల ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రంతో గోపీచంద్ మలినేని బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండటంతో ఈ మూవీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సన్నీ డియోల్ జాట్ మూవీ

ఇక గదర్-2 సక్సెస్ తర్వాత ఫుల్ జోష్ మీదున్న సన్నీ డియోల్ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే బార్డర్-2 (Border 2) ప్రాజెక్టుకు సై అన్న ఈ నటుడు.. తాజాగా గోపీచంద్ మలినేని వంటి తెలుగు దర్శకుడితో జాట్ చిత్రం చేస్తున్నాడు. ఇక డాన్ శీను, బాడీగార్డ్, బలుపు, పండగచేస్కో, విన్నర్, క్రాక్, వీరసింహా రెడ్డి వంటి సినిమాలతో గోపీచంద్ టాలీవుడ్ లో తన మార్క్ చాటాడు. 

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *