డీసీ యూనివర్స్(DC Universe)లో భాగంగా ప్రముఖ డైరెక్టర్ జేమ్స్ గన్ (Director James Gunn) దర్శకత్వంలో రూపొందిన ‘సూపర్‌మ్యాన్’ (Superman 2025) చిత్రం జులై 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్(Box Office) వద్ద రూ.5090 కోట్లకు పైగా వసూళ్ల(Collections)తో సంచలనం సృష్టించింది. ఈ హాలీవుడ్(Hollywood) సూపర్ హీరో మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. దర్శకుడు జేమ్స్ గన్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, ఆగస్టు 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video), ఆపిల్ టీవీ, ఫాండాంగో ఎట్ హోమ్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు.
#Superman Soars to Digital: Catch the Man of Steel at Home Starting August 15!#SupermanMovie #SupermanOnOTT #OTTRelease #OTTUpdates pic.twitter.com/KhQ6gGwYmy
— OTTRelease (@ott_release) August 12, 2025
సూపర్‌మ్యాన్ విన్యాసాలు ఆకట్టుకుంటాయి
అయితే, ఈ చిత్రం సబ్‌స్క్రైబర్‌లకు ఉచితంగా అందుబాటులో ఉండదు, రెంట్ చెల్లించి చూడాల్సి ఉంటుందని గన్ తెలిపారు. ప్రీ-ఆర్డర్ ఆప్షన్(Pre-order option) కూడా అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో డేవిడ్ కోరెన్స్‌వెట్(David Korenswet) సూపర్‌మ్యాన్ పాత్రలో నటించగా, నికలస్ హోల్ట్(Nicholas Holt) లెక్స్ లూథర్‌గా, రెచెల్ బ్రోస్నహన్ లొయిస్ లేన్‌గా కనిపించారు. కథలో సూపర్‌మ్యాన్ తన సొంత గ్రహం క్రిప్టాన్(Cripton)ను కాపాడలేకపోయిన పశ్చాత్తాపంతో భూమిపై కొత్త జీవితాన్ని ఆరంభిస్తాడు. అయితే, లెక్స్ లూథర్ సృష్టించిన ‘హ్యామర్ ఆఫ్ బొరేవియా’ ఆయుధంతో అతడిని అంతం చేయాలని కుట్ర పన్నుతాడు. ప్రజల్లో సూపర్‌మ్యాన్‌పై అపనమ్మకాన్ని రేకెత్తించేందుకు లూథర్ చేసే ప్రయత్నాలు, సూపర్‌మ్యాన్ విన్యాసాలు ఆకట్టుకుంటాయి.
హైలైట్‌గా యాక్షన్, భావోద్వేగాలు, విజువల్స్
లొయిస్ లేన్, ఇతర సూపర్ హీరోల సహాయంతో అతడు ఆ సవాళ్లను ఎలా అధిగమిస్తాడనేది మాత్రం స్క్రీన్‌పై చూడాల్సిందే. ఈ చిత్రం యాక్షన్, భావోద్వేగాలు, విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో అనుకున్న స్థాయిలో ఆదరణ లభించలేదని జేమ్స్ గన్ అభిప్రాయపడ్డారు. యూఎస్‌లో మాత్రం ఇది రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. 4కే యూహెచ్‌డీ, బ్లూ-రే, DVD ఎడిషన్స్ సెప్టెంబర్ 23 నుంచి అందుబాటులో ఉంటాయి.






