NC25: సైలెంట్‌గా షూటింగ్ మొదలు పెట్టిన నాగచైతన్య.. డైరెక్టర్ ఎవరంటే?

అక్కినేని హీరోలు ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య(Naga Chaitanya) ‘తండేల్(Thandel)’ సినిమా ద్వారా సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక నాగార్జున(Nagarguna) కూడా ఇటీవల “కూలీ(Coolie)” “కుబేర(Kubera)” వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక నాగచైతన్య తన 24వ సినిమా షూటింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే 25వ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడి డైరెక్షన్లో నాగచైతన్య సినిమా చేయబోతున్నారని సమాచారం.

Naga Chaitanya Shares Intense Poster Of Upcoming Movie NC24 On 38th Birthday

చైతూకి జోడీగా యంగ్ హీరోయిన్

ఈ సినిమాకు కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరి మధ్య చర్చలు కూడా జరిగాయని కథ నచ్చిన నాగచైతన్య ఈ సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా యంగ్ హీరోయిన్ మమితా బైజు(Mamita Baiju) హీరోయిన్ గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇలా ఈ సినిమాకు సంబంధించిన చర్చలు పూర్తి కావడంతో కొరటాల ప్రీ ప్రొడక్షన్ పనుల(Pre Production Works)ను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

Naga Chaitanya resumes shoot for Mythological Thriller 'NC24'

దేవర-2 ఇప్పట్లో లేనట్లేనా?

ఇకపోతే గత కొద్దిరోజులుగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR) హీరోగా నటించాల్సిన దేవర 2(Devara2) సినిమా క్యాన్సిల్ అయ్యిందని అదే కథతో నాగచైతన్యతో సినిమా చేస్తున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి మరి దేవర 2 కథతోనే కొరటాల నాగచైతన్యతో సినిమా చేయబోతున్నారా లేదంటే కొత్త కథ చేయబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *