సుకుమార్ లెక్క మారనుందా.. నెక్ట్స్ ప్రాజెక్ట్ బాలీవుడ్ బాద్‌షాతోనే!

లెక్కల మాస్టర్ సుకుమార్(Director Sukumar).. కానీ సినిమా తీయడంలో ఆయన లెక్కే వేరు. తెరపై ఏ హీరోని ఎలా చూపించాలి.. ఎలాంటి గెటప్స్ వేయించాలనే దానిపై ఆయన లెక్కలు ఇతర డైరెక్టర్ల కంటే కాస్త భిన్నంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇటీవల పుష్ప-2(Pushpa-2)తో తన మాస్టర్ మైండ్ ఏంటో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నసినీ అభిమానులకు చూపించాడు డైరెక్టర్ సుకుమార్. ఈ మూవీ వసూళ్ల(Collections) పరంగా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో మూవీలకు కాస్త ఇచ్చాడు సుకుమార్. అయితే తాజాగా ఆయన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Allu Arjun and Sukumar shoot for Pushpa 2 The Rule climax after weeks of  rumours about tiff - Hindustan Times

రామ్ చరణ్‌తో మూవీ తర్వాత..

అయితే ఈసారి సుకుమార్ కన్ను బాలీవుడ్‌(Bollywood) మీద పడినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు బాలీవుడ్‌ సెంట్రిక్‌గా పాన్‌ ఇండియా(Pan India) మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట సుక్కు. అందుకోసం ఓ పెద్ద స్టార్‌తో డిస్కషన్స్ నడుస్తున్నాయట. పుష్ప-2 టేకింగ్‌, సినిమా సక్సెస్‌తో ఆ స్టార్ హీరో సుక్కుతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారని Tటౌన్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్‌(Ram Charan)తో మూవీ తర్వాత బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ ఖాన్‌(Shah Rukh Khan)తో మూవీ చేయబోతున్నాడట సుకుమార్.

Not for a thriller like Anjaam, but Sukumar and Shah Rukh Khan to  collaborate on a rural action political drama –

సైకలాజికల్ యాక్షన్ డ్రామాగా..

సుకుమార్ డైరెక్షన్‌లో SRK ఓ ఇంట్రెస్టింగ్‌ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడట. అంజామ్‌ తరహా సైకలాజికల్ యాక్షన్ డ్రామా(A psychological action drama)గా ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సౌత్ ప్లస్‌ నార్త్ మిక్స్‌డ్ స్టోరీతో మూవీ ఉండబోతోందట. ప్రస్తుతం సుకుమార్ రామ్‌చరణ్ RC17 స్క్రిప్ట్ వర్క్‌లో ఉన్నాడు. చరణ్ బుచ్చిబాబు(Bucchibabu)తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్, చరణ్ కలిసి సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. RC17 తర్వాత షారుఖ్‌ఖాన్‌తో సుకుమార్‌ మూవీ చేస్తారని అంటున్నారు. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *