కమెడియన్ వేణు(Venu yeldandi).. అనగానే తెలుగు ప్రేక్షకులకు సరిగా గుర్తుండకపోవచ్చు. అదే మున్నా(munna movie) సినిమాలో టిల్లు(Tillu) అనగానే గుర్తుపడుతుంటారు. ఎందుకంటే ఆ సినిమా వేణుకు మంచి పేరు తీసుకొచ్చింది. అదేవిధంగా బలగం (Balagam movie) మూవీ డైరెక్టర్ అనగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఏకంగా ఓవసీస్‌లోని తెలుగు ఫ్యాన్స్ సైతం మనోడిని గుర్తుచేస్తుంటారు. ఎందుకంటే ఆ ఒక్క సినిమా వేణు జీవితాన్నే మార్చేసింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సైతం వేణు టాలెంట్‌ను చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయారంటే అతిశయోక్తి కాదు.
బలగం తర్వాత గ్యాప్..
బలగం సినిమా దర్శకుడిగా చాన్స్ కోసం ఎంతో శ్రమించిన వేణు(Venu).. మొత్తానికి ఆ సినిమాను తీసి సూపర్ సక్సెస్ కొట్టాడు. బలగం సినిమా ఊహించని విజయం సాధించడంతో వేణు పేరు మారుమోగిపోయింది.ఒక సాధారణ వ్యక్తి స్టార్ డైరెక్టర్ స్థాయికి మారిపోయాడు.ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చ జరిగింది. ఆయనతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు సైతం వెంటపడ్డారు. ఇక కంటిన్యూగా సినిమాలు చేస్తారని అంతా భావించారు. కానీ, అనుకోకుండా ఆయన తన తదుపరి సినిమా కోసం లాంగ్ బ్రేక్ ఇచ్చారు.
Jai hanuman 🙏🙏#jaihanuman #yellamma #cinema #dreams #culture pic.twitter.com/xoVEK7XHw9
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) May 20, 2025
ఎల్లమ్మ సినిమా అప్డేట్ రివీల్..
ప్రస్తుతం వేణు తర్వాతి సినిమా ‘ఎల్లమ్మ'(Yellamma movie) కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్, నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.’బలగం’ లాగే ‘ఎల్లమ్మ’ కూడా అందరినీ మెప్పిస్తుందని వేణు ధీమాగా ఉన్నారు. అయితే, ‘ఎల్లమ్మ’ సినిమా కథను పెద్ద పెద్ద హీరోలకు వినిపించగా.. చివరకు ఓ హీరో ఓకే చెప్పినట్లు తెలిసింది.
ముందుగా ఈ కథను నేచురల్ స్టార్ నాని(hero Nani) కి వినిపించగా.. ఫైనల్ వర్షన్ నచ్చలేదని తెలిసింది.
తర్వాత శర్వానంద్ (Sharwanand) వద్దకు కథ వెళ్లగా.. ఆయన కూడా నో చెప్పారని టాక్. ఇక హనుమాన్ హీరో తేజ సజ్జా (Teja sajja) ఈ స్టోరీ చేయడానికి ఓకే చెప్పినా డేట్స్ అడ్జస్ట్ కాలేదని తెలిసింది. ఫైనల్‌గా హీరో నితిన్ (Hero nithin) వద్దకు వేణు వెళ్లగా.. ఫైనల్ అయినట్లు సమాచారం. త్వరలోనే ఒప్పందాలు పూర్తి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వేణు సోషల్ మీడియా వేదికగా ఎల్లమ్మ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘ఎల్లమ్మ’ అంటూ స్క్రిప్ట్ బుక్ పట్టుకున్న ఫొటోను షేర్ చేయడంతో ఎన్నో రోజుల ఉత్కంఠకు తెరపడినట్లు అయ్యింది.






