Mana Enadu : దీపావళి పండుగ (Diwali) వచ్చేస్తోంది. ఇక ఇటు థియేటర్ లో అటు ఓటీటీల్లో ధమాకా చేసేందుకు సినిమాలు, వెబ్ సిరీస్ లు సిద్ధమయ్యాయి. ఈ పండుగ వేళ ఇంటిల్లిపాది జాలీగా గడిపేందుకు పలు చిత్రాలు రెడీగా ఉన్నాయి. ఇక ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పంచేందుకు విభిన్న వెబ్ సిరీస్ లు కూడా క్యూ కట్టాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దామా..?
థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే
లక్కీ భాస్కర్ (Lucky Baskhar) – దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కించాడు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
క – కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా సుజిత్- సుదీప్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘క’ . ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీన థియేటర్ లో విడుదల కానుంది. ఇందులో నయన సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అమరన్ – శివకార్తికేయన్, సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రం అమరన్. ఉగ్ర దాడిలో అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ అవుతోంది.
బఘీర – ‘కేజీయఫ్’, ‘సలార్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashant Neel) అందించిన కథతో వచ్చిన సినిమా బఘీర. శ్రీమురళి, రుక్మిణీ వసంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. సూరి తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 31న రిలీజ్ కానుంది.
సింగమ్ అగైన్ – అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో రోహిత్‌శెట్టి తెరకెక్కించిన చిత్రం ‘సింగమ్ అగైన్’ (Singham Again) అక్టోబర్ 31న విడుకల అవుతోంది.
ఓటీటీలో అలరించనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే
ఈటీవీ విన్
- లవ్ మాక్‌టైల్ సీజన్ 2 (తెలుగు వెబ్‌సిరీస్) : అక్టోబరు 31
నెట్‌ఫ్లిక్స్
- టైమ్ కట్ (హాలీవుడ్): అక్టోబరు 30
- మర్డర్ మైండ్‌ఫుల్లీ (హాలీవుడ్): అక్టోబరు 31
- ది డిప్లోమ్యాట్ సీజన్ 2 (హాలీవుడ్ వెబ్‌సిరీస్): అక్టోబరు 31
జీ 5
- మిథ్య (వెబ్‌సిరీస్.. తెలుగులోనూ): నవంబరు 1
ఆహా
- అర్థమయ్యిందా..? అరుణ్‌కుమార్ సీజన్ 2 (తెలుగు వెబ్‌సిరీస్): అక్టోబరు 31
హాట్‌స్టార్
- లబ్బర్ పందూ (తెలుగు డబ్బింగ్): అక్టోబరు 31
- కిష్కంధ కాండం (తెలుగు డబ్బింగ్): నవంబరు 1
- విజార్డస్ బియాండ్ వేవర్లీ ప్లేస్ (హాలీవుడ్ సిరీస్): అక్టోబరు 30