దీపావళి మూవీ ట్రీట్.. కొత్త పోస్టర్లు వచ్చేశాయ్

Mana Enadu : టాలీవుడ్ లో దీపావళి (Diwali) సందడి షురూ అయింది. పండుగ పూట బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలు సూపర్ హిట్ గా దూసుకెళ్తుంటే.. మరోవైపు సోషల్ మీడియాలో కొత్త సినిమా అప్డేట్స్ కనువిందు చేశాయి. పలు నిర్మాణ సంస్థలు తమ కొత్త సినిమాల అప్డేట్స్ ను షేర్ చేసుకున్నారు. ఇందులో రామ్ చరణ్ సినిమా నుంచి నాని హిట్-3, నితిన్ రాబిన్ హుడ్ (Robin Hood), అనిల్ రావిపూడి-వెంకటేశ్ సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమా సంగతులేంటో చూద్దాం..

RC 16 అప్డేట్ ఇదే

ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు బుచ్చిబాబుతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఓ సినిమా చేస్తున్నాడు. RC 16 వర్కింగ్ టైటిల్​తో వస్తున్న ఈ మూవీలో బీ టౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తోంది. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూట్‌ త్వరలోనే ప్రారంభం కానుందని ప్రకటించారు.

నాని హిట్-3 న్యూ పోస్టర్ 

థ్రిల్లర్ మూవీ హిట్‌ ఫ్రాంచైజీలో నేచురల్ స్టార్ నాని హీరోగా ‘హిట్ – ది థర్డ్ కేసు (HIT – The Third Case)’ సినిమా రాబోతోంది. శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా దీపావళి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ కాప్ గా నాని (Actor Nani) నటించబోతున్నాడు. వచ్చే ఏడాది మే 1వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

హ్యాట్రిక్ కోసం వస్తున్న హిట్ కాంబో

ఆరు పదుల వయసులోనూ జోష్ చూపిస్తున్నారు విక్టరీ వెంకటేశ్ (Actor Venkatesh). ఆయన హీరోగా.. దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ కాంబో మరోసారి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 1వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ షేర్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టైటిల్, ఫస్ట్ లుక్ ను రివీల్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇవే కాకుండా నితిన్ రాబిన్​హుడ్​​, మంచువిష్ణు కన్నప్ప (Kannappa), తమన్నా ఓదెల 2 చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు కూడా విడుదల అయ్యాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *