
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన(Air India Plane Crash) ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది శరీరాలను గుర్తించడం ప్రస్తుతం ఫోరెన్సిక్ వైద్యులకు కత్తిమీద సాముగా మారింది. ప్రమాదంలో మృతదేహాలు తీవ్రమైన కాలిపోయే స్థితిలో ఉండటంతో కణజాలం (Tissue) ద్వారా DNA పరీక్షలు చేయాల్సి వస్తోంది. ఒక్కో మృతదేహాన్ని గుర్తించేందుకు దాదాపు 24 గంటల సమయం పడుతోందని ఆరోగ్యశాఖ(Health Department) అధికారులు చెబుతున్నారు. కాగా గత ఐదు రోజులుగా ఇప్పటి వరకూ 125 మృతదేహాల డీఎన్‌ఏ గుర్తించగా.. 83 మృతదేహాల(Dead bodies)ను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన మృతదేహాల అప్పగింత ఇంకా కొనసాగుతోంది. కాగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో (Ahmedabad Civil Hospital) డీఎన్‌ఏ ప్రయోగశాలలో ఈ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
అన్ని కోణాల్లోనూ కొనసాగుతోన్న విచారణ
అహ్మదాబాద్‌లో గతవారం ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్‌లైనర్ విమానం(Dreamliner aircraft) సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి సమీపంలోకుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విమానంలోని 241 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించగా.. అది కూలిన మెడికల్ కాలేజీ భవనంలోని మెడికోలు, వైద్యులు, సామాన్య ప్రజలు 38 మంది సహా మొత్తం 279 మంది చనిపోయారు. ఇక ఇప్పటికే ఈ ప్రమాదం వెనుకున్న కారణాలను విమానయాన శాఖ, సాంకేతిక నిపుణులు, UK, US ఎయిర్ పోర్టుల సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. బ్లాక్ బాక్స్ డేటా, టెక్నికల్ సమస్యలు(Technical issues), పైలట్ల తప్పిదాలు వంటి కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
Summary Dispatch Report
Updates up to :- 16/06/2025, 10:25 p.m.
NO. OF DNA MATCH – 125
NO. OF RELATIVES CONTACTED- 124
NO. OF MORTAL RELEASED- 83
The pending mortal remains will be handed over soon.
— Rushikesh Patel (@irushikeshpatel) June 16, 2025