స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు మంచి శుభవార్త చెప్పింది. చిరు వ్యాపారులు, చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారికి సులభంగా రుణ సదుపాయం కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) కింద ఇ-ముద్రా పేరుతో ఎస్‌బీఐ ఆన్‌లైన్ ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. ఈ లోన్ కోసం బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచే అప్లై చేయవచ్చు.
ఇ-ముద్రా ద్వారా గరిష్ఠంగా రూ.1 లక్ష( 1 Lakh) వరకు రుణం అందుతుంది. ముఖ్యంగా రూ.50,000 లోపు రుణాన్ని పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పొందొచ్చు. అయితే రూ.50,000కు పైగా రుణం కోసం బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించాలి. రుణం పొందాలనుకునే వ్యక్తి మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్ అయి ఉండాలి. ఎస్‌బీఐలో సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతా ఉండి కనీసం 6 నెలలు(Complete 6 Months ) పూర్తయి ఉండాలి.
5 సంవత్సరాల వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు. ఎక్కువ టెన్యూర్ ఎంచుకుంటే ఈఎంఐ తక్కువగా ఉంటుంది, కానీ మొత్తం వడ్డీ ఎక్కువవుతుంది. ఇప్పటికే వ్యాపారం చేస్తున్నవారు వ్యాపార విస్తరణకు ఈ రుణాన్ని వినియోగించుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తు విధానం:
1. SBI ఇ-ముద్రా వెబ్‌సైట్ కి వెళ్ళాలి.
2. “Apply Now” క్లిక్ చేసి, షరతులకు అంగీకరించాలి.
3. మొబైల్ నంబర్, ఖాతా నంబర్, కావలసిన లోన్ మొత్తాన్ని ఎంటర్ చేయాలి.
4. క్యాప్చా ఇచ్చి “Proceed” క్లిక్ చేయాలి.
5. అప్లికేషన్ ఫార్మ్ నింపి, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, ఆధార్‌తో ఇ-సైన్ చేయాలి.
6. ఓటీపీ ద్వారా ప్రాసెస్ పూర్తి చేయాలి.






