మహేష్ బాబు, ప్రభాస్ లతో రొమాన్స్ చేసినా కలసిరాని అదృష్టం.. దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్ ఈ హీరోయిన్

పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి కృతి సనన్(Kriti Sanon) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన గ్లామర్‌తోనే కాక, నటనతోనూ మంత్రముగ్ధులను చేసే ఈ ముద్దుగుమ్మ, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది.

తెలుగు తెరపై తొలి అడుగులు

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన.. తెలుగు తెరపై మాత్రం ఆమెకు కలిసి రాలేదు. తెలుగులో మహేష్ బాబు హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘1 – నేనొక్కడినే’ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. ఈ సినిమాతో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించినప్పటికీ, సినిమాకు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన దోచెయ్ చిత్రంలో కనిపించింది. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, తెలుగులో ఆమె కెరీర్ గాడిలో పడక ముందే ఆగిపోయింది.

బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ ప్రయాణం

తెలుగులో తక్కువ అవకాశాలు దక్కినా, కృతి బాలీవుడ్‌లో మాత్రం దూసుకుపోయింది. వరుస సినిమాలు చేస్తూ, నటనతోనూ గ్లామర్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం కమర్షియల్ పాత్రలకే కాదు, నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూ విమర్శకుల ప్రశంసలు పొందింది. 2021 సంవత్సరానికి గాను ఆమె నేషనల్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ గెలుచుకోవడం విశేషం. ఇది ఆమె టాలెంట్‌కు నిదర్శనం.

ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’లో జానకి పాత్ర

ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ఆదిపురుష్ లో కృతి, జానకి పాత్రలో నటించింది. ప్రభాస్ ఈ చిత్రంలో శ్రీరాముడిగా నటించగా, కృతి సనన్ సరసన హీరోయిన్‌గా మెరిసింది. అయితే ఈ సినిమా కంటెంట్ విషయంలో నిరాశపర్చడంతో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయింది.

విలాసవంతమైన జీవితం – ముంబైలో విల్లా కొనుగోలు

కృతి ప్రస్తుతం ముంబైలోని బాంద్రాలో రూ. 35 కోట్లు వెచ్చించి 4 BHK అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. అక్కడే ఆమె నివసిస్తోంది. దిల్లీలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు దేశంలో అత్యంత హై డిమాండ్‌లో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరుగా ఎదిగింది.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రయాణం

మహేష్ బాబు, నాగ చైతన్య, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన కృతి సనన్, తెలుగులో తక్కువ సినిమాలు చేసినా, తన కెరీర్‌ను బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఆమె నటించిన ప్రతి సినిమా ప్రత్యేకతను చూపించడమే కాకుండా, తనదైన స్టైల్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *