భారత్‌లో పెరిగిన కుబేరులు.. సంపద తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

దేశంలో బిలియనీర్ల(Billionaires) సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ సంఖ్య 185కు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం, యుద్ధ భయాలు ఆర్థిక పరిస్థితుల(Financial Situations)పై అయోమయ పరిస్థితులు నెలకొన్న వేళ.. వీటితో సంబంధం లేనట్లుగా సంపన్ను(Billionaires)ల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గడిచిన పదేళ్లలో వీరి సంపన్నుల సంపద ఏకంగా 121 శాతం పెరిగినట్లుగా స్విట్జర్లాండ్(
Switzerland) కు చెందిన అతి పెద్ద బ్యాంక్యూబీసీ(BANKUBC) వెల్లడించింది. బిలియనీర్ల సంపదపై వార్షిక నివేదిక(Annual Report)ను తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది.

పెరిగిన బిలియనీర్ల సంపద

భారతదేశం(India)లో బిలియనీర్ల సంఖ్య 185కు పెరిగిందని.. వీరి సంపద మొత్తం విలువ(Total value of wealth) మన రూపాయిల్లో రూ.76 లక్షల కోట్లకు పైనే ఉన్నట్లు చెప్పింది. 2015లో ప్రపంచ వ్యాప్తంగా 1757 మంది కుబేరులు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 2682కు పెరిగిందని.. 2022లో అత్యధికంగా 2686గా ఉన్నట్లు వెల్లడించింది. ఈ పదేళ్లలో కుబేరుల సంపద మొత్తం విలువ 6.3 ట్రిలియన్ డాలర్ల నుంచి 14 ట్రిలియన్ డాలర్లకు పెరిగినట్లుగా పేర్కొంది.

ఈ ఏడాది కొత్తగా 268 మంది

ఇక ఈ ఏడాది కొత్తగా 268 మంది బిలియనీర్లు(New Billionaires) లిస్టులో చేరారని.. వీరిలో 60 శాతం మంది వ్యాపార వ్యవస్థాపకులేనని చెప్పింది. అమెరిక(America) కుబేరుల సంపద విలువ 27.6 శాతం పెరిగి 5.8 ట్రిలియన్ డాలర్లుగా లెక్క కట్టింది. 2024లో చైనా, హాంకాంగ్(
China, Hong Kong)లో బిలియనీర్ల సంఖ్య 588 నుంచి 501కు తగ్గటం గమనార్హం. భారత్ లో మాత్రం బిలియనీర్ల సంఖ్య పెరిగింది. 2024లో 153 మంది నుంచి 185 మందికి పెరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) లో బిలియనీర్ల సంపద 39.5 శాతం పెరిగి 138.7 బిలియన్ డాలర్లుగా ఉననట్లు రిపోర్టు వెల్లడించింది.

Related Posts

Gold & Silver Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు (Gold Rate) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ, జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. ఇండియా-అమెరికా మధ్య టారిఫ్‌ల ప్రభావం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్‌(Dollar) క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరల (Gold…

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. కేజీ వెండి రేటెంతంటే?

బంగారం ధరలు(Gold Rates) రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad Bullion Market)లో ఈ రోజు (ఆగస్టు 29) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,03,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *