
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). పలు సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న చిరంజీవి.. తన సినీ జీవితంలో ఎంతో కష్టపడి ఎదిగారు. పట్టుదలతో, అంచలంచలుగా ఎదుగుతూ టాప్ స్టార్ హీరో అయ్యారు. ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను పోషించారు. 150 సినిమాలకు పైగా నటించిన ఆయన ఎందరో హీరోయిన్లతో జత కట్టారు. అయితే అందులో ఓ హీరోయిన్ మాత్రం చాలా ప్రత్యేకం. మరి ఆమె ఎవరు? చిరంజీవికి ఎందుకంత స్పెషల్ అనేది చూద్దామా.
మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్‌లో ఆయన నటించిన 8 ఇండస్ట్రీ హిట్ చిత్రాలు ఉన్నాయని తెలిసిందే. వాటిలో సగం చిత్రాల్లో హీరోయిన్‌గా విజయశాంతి(Vijaya Shanthi) నటించింది. చిరంజీవి కెరీర్‌లో “లక్కీ హీరోయిన్”గా అభిమానులు భావిస్తారు.
చిరంజీవి కెరీర్‌లో ఎక్కువగా రాధిక, రాధా, విజయశాంతి వంటి టాప్ హీరోయిన్లతో సినిమాలు చేశాడు. వీరిలో చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్‌కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలసి చేసిన సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాలలో నటించారు.
1983లో సంఘర్షణ అనే చిత్రంతో తొలిసారి వీరిద్దరికి జత కలిసింది. ఆ తర్వాత పదేళ్లలో వీరిద్దరి కాంబినేషన్ లో ఏకంగా 19 చిత్రాలు వచ్చాయి. వీటిలో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. విజయశాంతి తర్వాత రాదా చిరంజీవితో కలిసి 16 చిత్రాలలో నటించింది. 1993లో వచ్చిన మెకానిక్ అల్లుడు చిత్రంలో చిరంజీవి, విజయశాంతి చివరిసారిగా తెరపై కనిపించింది. ఇక 2020లో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ లో నటించింది.
మెగాస్టార్ చిరంజీవి, లేడి అమితాబ్ విజయశాంతి కలిసి నటించిన 19 చిత్రాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.
1. ఛాలెంజ్
2. దేవాంతకుడు
3. కొండవీటి రాజా
4. ఛాలెంజ్ సంఘర్షణ
5. చిరంజీవి
6. మహానగరంలో మాయగాడు
7. చాణక్య శపథం
8. ధైర్యవంతుడు
9. స్వయంకృషి పసివాడి ప్రాణం
10. పసివాడి ప్రాణం
11. మంచి దొంగ
12. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
13. యుద్ధభూమి
14. యముడికి మొగుడు
15. స్టువర్టుపురం పోలీస్ స్టేషన్
16. కొండవీటి దొంగ
17. రుద్రనేత్ర
18.మెకానిక్ అల్లుడు
19. గ్యాంగ్ లీడర్. ఈ చిత్రాల్లో కొన్ని బ్లాక్‌బస్టర్‌లు కాగా, కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా గుర్తింపు పొందాయి.