తెలుగు, తమిళ సినీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్నేహ(Sneha) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటనతో పాటు తన అందచందాలతోనూ అభిమానులను మంత్రముగ్ధులను చేసిన ఈ అందాల తార అసలు పేరు సుహాసిని. సినీ ప్రపంచంలో మాత్రం ఆమె స్నేహ అనే పేరుతో పరిచయం అయింది.
తొలివలపు చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ప్రియమైన నీకు, సంక్రాంతి, రాధా గోపాళం, శ్రీరామదాసు, హనుమాన్ జంక్షన్, మధుమాసం, మహారధి, వెంకీ, ఏవండోయ్ శ్రీవారు, పాండురంగుడు వంటి వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది.
స్నేహ సహాయ పాత్రలలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇటీవలి కాలంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి, రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా దళపతి విజయ్ నటించిన ‘గోట్’ సినిమాలో ఆయన భార్యగా నటించిన ఆమె పాత్రకు మంచి స్పందన వచ్చింది.
తెలుగుతో పాటు తమిళంలోనూ స్నేహకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. విజయ్, అజిత్, సూర్య, ధనుష్, కమల్ హాసన్, ప్రశాంత్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్షేర్ చేసుకుంది. ముఖ్యంగా దళపతి విజయ్, అజిత్ లతో చేసిన సినిమాలు ఘనవిజయం సాధించాయి. అంతేకాదు ఆమెకు కోలీవుడ్లో మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్నేహ మాట్లాడుతూ తన ఫెవరేట్ హీరో ఎవరు అనేదానికి సమాధానం చెప్పింది. తనకు తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar)అంటే చాలా ఇష్టమని, ఆయన నటన, వ్యక్తిత్వం తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం స్నేహ నటన పరంగా ఆచితూచి సినిమాలు చేస్తూ, కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ, తన ఫోటోలు, పర్సనల్ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులను టచ్లో ఉంచుతోంది.






