Mana Enadu : అమెరికా అధ్యక్ష ఎన్నికల(US Presidential Elections 2024)కు మరో వారం రోజులే ఉంది. నవంబర్ 5వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(Kamala Harris)లు బరిలో నిలిచారు. ఈ రేసులో మొదటి నుంచి ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తుండగా.. కాస్త లేటుగా చేరినా కమలా హారిస్ ట్రంప్ కు దీటుగా పోటీనిచ్చారు.
కమలా హారిస్ ముగింపు సభ
ఇక ఎన్నికల ప్రచారంలో ఈ ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపిస్తూ జోరు చూపించారు. అమెరికన్ ఓటర్లను ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. మరో వారం రోజుల్లోనే ఎన్నికలు ఉండటంతో చివరి వంతుగా ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు చేసిన ముగింపు సభ(Kamala Harris Closing Speech)లో తాజాగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రసంగించారు.
ఏం కావాలో మీరే తేల్చుకోండి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమెరికా ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారా లేక గందరగోళం, విభజన కోరుకుంటున్నారా అని ఓటర్ల(US Voters)ను ప్రశ్నించారు. మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపే నిర్ణయం తీసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇది చాలా ముఖ్యమైన ఓటు అని పేర్కొన్నారు. స్వేచ్ఛతో కూడిన దేశం కావాలా? లేక విభజన, గందరగోళంతో పాలించడం కావాలా? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది’ అని కమలా హారిస్ ప్రసంగించారు.
వారి మద్దతు హారిస్ కే
ఇక ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల (Indo American Voters) మద్దతు కమలా హారిస్‌కే ఉందని ఇటీవల ఓ సర్వే తేల్చింది. 61 శాతం మంది భారతీయ అమెరికన్లు హారిస్ వైపే ఉన్నారని తెలిపింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌న(Donald Trump)కు 31 శాతం మంది మద్దతు ఉందని ఈ సర్వే పేర్కొంది. మరి నవంబర్ 5వ జరగనున్న ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు ఎవరికి ఓటు వేస్తారో వేచి చూడాల్సిందే.