
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk) మధ్య మాటల యుద్ధం రచ్చకెక్కింది. ట్రంప్ సంతకం చేసిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు(Big Beautiful Bill)’ను మస్క్ నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఎలాన్ మస్క్ వైఖరిపై నిరాశ వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రకటన తర్వాత, మస్క్ ఫైర్ అయ్యాడు. తాను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారన్నారు. ప్రతినిధుల సభపై డెమోక్రట్లు(Democrats) ఆధిక్యం సాధించేవారు. సెనెట్లో రిపబ్లికన్లు 51-49తో ఉండేవారంటూ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో అమెరికాలో కొత్త పార్టీ వస్తే ఎలా ఉంటుందనే పోల్ నిర్వహించగా 70శాతం మంది బాగుంటుందని ఓటేశారు. ఒకవేళ మస్క్ పార్టీ పెడితే అమెరికాలో మూడో పార్టీ రానుంది.
ఆర్థిక సాయం చేస్తే చూస్తూ ఊరుకోను..
దీంతో రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లు(Republican tax bill)ను మస్క్ వ్యతిరేకించడంతో తాను అసంత్రుప్తికి గురయ్యానని.. వైట్ హౌస్(White House)లో తన స్నేహితుడు లేకపోవడం విచారకరమని ట్రంప్ అంతకుముందు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్‌తో తన బంధం ముగిసినట్లేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. మస్క్ ఇక నుంచి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సాయం(Financial assistance) చేస్తే చూస్తూ ఊరుకోబోనని స్పష్టం చేశారు. ఒకవేళ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. కాగా 2024 US ఎన్నికల్లో ట్రంప్ గెలవడంలో మస్క్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.