అడిలైడ్ టెస్టులో టీమిండియా (Team India) పేలవ ప్రదర్శన తర్వాత భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunul Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశారు. జట్టు వైఖరి, సన్నద్ధతపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పింక్ బాల్ టెస్టు కోసం భారత ఆటగాళ్ల సన్నద్దత సరిపోలేదని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో మూడో టెస్టు కోసం కీలక సూచనలు చేశాడు.
ప్రాక్టీస్ కోసం సద్వినియోగం చేసుకోవాలి
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని (border gavaskar trophy) చూసే దృక్పథాన్ని మార్చుకోవాలని, ఆడిలైడ్ టెస్టు రెండున్నర రోజుల్లోనే ముగియడంతో మిగిలిన రెండు రోజులను ప్రాక్టీస్ కోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. హోటల్ రూమ్స్‌లో కూర్చోకుండా మైదానంలోకి దిగాలన్నాడు.
చెమట చిందించండి
‘బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన సిరీస్‌ను మూడు మ్యాచ్‌ల సిరీస్‌గానే భావించండి. ఇది ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అనే విషయాన్ని మర్చిపోండి. రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. దీంతో మిగిలిన రెండు రోజుల సమయాన్ని ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నా. భారత జట్టుకు ఇది చాలా కీలకమైన సమయం. మీరు ఇక్కడకు క్రికెట్ ఆడేందుకే వచ్చారు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని.. హోటల్ రూమ్స్‌లో కూర్చోకుండా.. మైదానంలోకి దిగండి. ప్రాక్టీస్ చేయండి. చెమట చిందించండి’ అని గవాస్కర్ సూచించాడు. రోజంతా ప్రాక్టీస్ చేయాల్సిన పనిలేదని, ఉదయం లేదా మధ్యాహ్నం ఏదో ఒక సమయంలో సెషన్ పాటు ప్రాక్టీస్ చేయాలని కోరాడు.
మొదట గెలుపు.. ఆ తర్వాత ఓటమి
బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా (Ind vs Aus) పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టులో 295 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా.. ఆడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో () 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. డిసెంబర్ 14 నుంచి గబ్బా వేదికగా మూడో టెస్టు జరగనుంది. మూడో టెస్టులో టీమిండియా పుంజుకొని సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని భారత ప్రేక్షకులు కోరుతున్నారు.








